EO Dharma Reddy Son : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు
19 December 2022, 12:28 IST
- EO Dharma Reddy Son టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చెన్నై పెళ్లి కార్డులు పంచుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన గుండపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ధర్మారెడ్డి కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెన్నైలోని కావేరి ఆస్పత్రి మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.
ఈవో ధర్మారెడ్డి కుమారుడి మెడికల్ బులెటిన్
EO Dharma Reddy Son టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటుకు గురి కావడంతో చద్రమౌళిని మిత్రులు హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇటీవల చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే.శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహాన్ని నిర్ణయించారు. వీరిద్దరికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థ వేడుకల్ని కూడా నిర్వహించరు.
వచ్చే ఏడాది జనవరిలో ధర్మారెడ్డి కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. తిరుమలలో వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన పనుల్లో రెండు కుటుంబాలు తలమునకలయ్యాయి. ఇరువైపు పెళ్లి కార్డుల్ని పంచుతున్నారు. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఉన్న బంధువులకు పెళ్లి కార్డులు ఇవ్వడానికి చంద్రమౌళి మిత్రుడితో కలిసి కారులో వెళ్లారు. పెళ్లి కార్డులు పంచుతూ గుండెలో నొప్పిగా అనిపిస్తోందంటూ మిత్రుడికి చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న కావేరి ఆస్పత్రికి తరలించారు.
చంద్రమౌళిని కావేరి ఆస్పత్రిలో చేర్చిన వెంటనే పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చంద్రమౌళి రెడ్డిని కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆదివారం ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు కావేరి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటించారు. ఆస్పత్రికి తీసుకు వచ్చిన వెంటనే చంద్రమౌళికి సిపిఆర్ నిర్వహించి, క్యాథ్‌ల్యాబ్‌కు తరలించినట్లు తెలిపారు. చంద్రమౌళికి స్టెంట్లు వేసి ఎక్మో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు
టీటీడీ ఈవో కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా వైద్యులు ప్రకటించారు. లైఫ్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. వేర్వేరు విభాగాలకు చెందిన వైద్యులు చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
టాపిక్