తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram Tragedy: విజయనగరం జిల్లాలో విషాదం,భార్య కళ్లెదుటే కొట్టుకుపోయిన భర్త, గాలింపు ముమ్మరం

Vizianagaram Tragedy: విజయనగరం జిల్లాలో విషాదం,భార్య కళ్లెదుటే కొట్టుకుపోయిన భర్త, గాలింపు ముమ్మరం

HT Telugu Desk HT Telugu

12 September 2024, 9:58 IST

google News
  • Vizianagaram Tragedy: విజ‌యన‌గ‌రం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం తీసుకుని భార్య భ‌ర్త‌లు ఇంటికి వెళ్తున్నారు. ఇంత‌లోనే భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోయాడు. దీంతో ఆ భార్య భ‌ర్త‌ని కాపాడండి అంటూ కేక‌లు వేసినా  ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

భార్య కళ్లెదుటే వరద నీటిలో కొట్టుకుపోయిన భర్త
భార్య కళ్లెదుటే వరద నీటిలో కొట్టుకుపోయిన భర్త

భార్య కళ్లెదుటే వరద నీటిలో కొట్టుకుపోయిన భర్త

Vizianagaram Tragedy: విజ‌య న‌గ‌రం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం తీసుకుని భార్య భ‌ర్త‌లు ఇంటికి వెళ్తుండగా వరద ప్రవాహంలో భర్త కొట్టుకుపోయిన విషాదఘటన చోటు చేసుకుంది. భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోతుండగా భ‌ర్త‌ని కాపాడాలని కేక‌లు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె కళ్ల ముందే భ‌ర్త వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాడు. ఏపీఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

ఈ విషాద ఘ‌ట‌న విజ‌య‌న‌గరం జిల్లా గంట్యాడ మండ‌లంలో బుధ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. విజ‌య‌న‌గరం జిల్లా ఎల్‌. కోట మండ‌లం చందులూరి గ్రామానికి చెందిన అప్ప‌ల‌బ‌త్తుల స‌తీష్ (35) భార్య వ‌ర‌ల‌క్ష్మితో క‌లిసి అత్త‌వారి గ్రామం గంట్యాడ మండ‌లం చంద్రంపేట‌కు మంగ‌ళ‌వారం వెళ్లారు.

బుధ‌వారం భార్య పేరు మీద వ‌చ్చిన డ్వాక్రా డ‌బ్బులు తీసుకుని ద్విచ‌క్ర వాహ‌నంపై గ్రామానికి వెళ్తున్నారు. గ్రామానికి స‌మీపంలోని పెద్ద‌గెడ్డ వాగు క‌ల్వ‌ర్టు దాటుతుండ‌గా నీటి ప్ర‌వాహం, అందులో నాచు కార‌ణంగా అదుపుత‌ప్పి ప‌డిపోయారు.

స‌తీష్ హ‌ఠాత్తుగా వాగులోకి కొట్టుకుపోయారు. ర‌క్ష‌ణ స్తంభాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న వ‌ర‌ల‌క్ష్మిని స్థానికులు ర‌క్షించారు. స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. స‌తీష్ క‌రెంటు, ఇనుప వ‌స్తువుల‌కు సంబంధించిన ప‌నులు చేస్తుంటారు.

చాలా ఏళ్ల క్రిత‌మే విద్యుదాఘాతానికి గురై ఒక చేతిని కోల్పోయారు. ప్లాస్టిక్ చేతిని అమ‌ర్చుకుని ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దిచ‌క్ర వాహ‌నం అదుపు త‌ప్పిన స‌మ‌యంలో ఒక్క చేతితో ప‌ట్టు కోల్పోయడ‌ని, అందువ‌ల్లే వ‌ర‌ద నీటి ప్ర‌వాహ‌నికి కొట్టుకుపోయాడ‌ని స్థానికులు చెబుతోన్నారు.

స‌మాచారం అందుకున్న ఆర్డీవో సూర్య‌క‌ళ‌, ఎమ్మార్వో నీల‌కంఠేశ్వ‌ర‌రావు, ఎస్ఐ సాయికృష్ణ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఏపీఎస్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దింపి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే ఎంత‌సేప‌టికి దొర‌క‌క‌పోవ‌డంతో రాత్రి కావ‌డంతో గాలింపు చర్య‌లు ఆపేశారు. అలాగే రాత్రి ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల ల‌లిత కుమారి, క‌లెక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

అధికారుల‌తో మాట్లాడి గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేప‌ట్టారు. గురువారం ఉద‌యం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మిస్సింగ్ కేసును న‌మోదు చేశారు. దీంతో స‌తీష్ కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. బంధువులు రోద‌న‌లు మిన్నంటాయి. ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని ఓదార్చుతూ ప్ర‌భుత్వం త‌ర‌పున స‌హాయం చేస్తామ‌ని ఎమ్మెల్యే ల‌లిత కుమారి హామీ ఇచ్చారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం