తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈ-వేలంలో టీటీడీ ఆల‌యాల్లో వినియోగించే మేల్‌ఛాట్ వస్త్రాలు

Tirumala : ఈ-వేలంలో టీటీడీ ఆల‌యాల్లో వినియోగించే మేల్‌ఛాట్ వస్త్రాలు

HT Telugu Desk HT Telugu

26 June 2022, 19:52 IST

google News
    • టీటీడీ ఆల‌యాల్లో వినియోగించిన మేల్‌ఛాట్ / ఊల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను వేలం వేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ వేలంలో వీటిని పెట్టనున్నారు.
మేల్‌ఛాట్ వస్త్రాల వేలం
మేల్‌ఛాట్ వస్త్రాల వేలం

మేల్‌ఛాట్ వస్త్రాల వేలం

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించే.. మేల్‌ఛాట్ వస్త్రాలను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ నిర్ణయించింది. జులై 11 నుంచి నాలుగు రోజుల పాటు ఈ వేలం వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా వేలం వేస్తారు. మొత్తం 143 లాట్లను ఈ వేలంలో ఉంచారు.

ఏదైనా అదనపు సమాచారం కావాలి అనుకునేవారు.. టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం నెంబర్.. 0877-2264429కు ఫోన్ చేయోచ్చు. ఫోన్‌ ద్వారా గానీ.. కార్యాలయం పని వేళల్లో సంప్రదించి తెలుసుకోవచ్చు. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చునని టీటీడీ బోర్డు తెలిపింది.

వైభవంగా శ్రీనివాస కల్యాణం

అమెరికాలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో అక్కడే స్థిరపడిన తెలుగువారు హాజరై శ్రీనివాసుడి కల్యాణాన్ని వీక్షించారు. శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు.

కల్యాణోత్స కార్యక్రమంలో పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం