TTD Chairman Members : టీటీడీ బోర్డు ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం, కొత్త సభ్యులు వీళ్లే
30 October 2024, 19:53 IST
TTD Chairman Members : టీటీడీ నూతన ఛైర్మన్, పాలక మండలి సభ్యులను ప్రకటించింది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ గా నియమితులయ్యారు.
టీటీడీ బోర్డు నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, సభ్యులు వీళ్లే
టీటీడీ నూతన పాలక మండలిని ప్రకటించింది. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటింటింది.
టీటీడీ పాలకమండలి సభ్యులు వీళ్లే
- జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మె్ల్యే)
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి -కోవూరు ఎమ్మెల్యే)
- ఎంఎస్ రాజు - మడకశిర ఎమ్మెల్యే
- పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి
- జాస్తి పూర్ణ సాంబశివరావు
- నన్నపనేని శ్రీసదాశివరావు
- కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- జంగా కృష్ణమూర్తి
- శాంతారామ్
- తమ్మిశెట్టి జానకీ దేవి
- నన్నూరి నర్సిరెడ్డి -తెలంగాణ
- బూంగునూరు మహేందర్ రెడ్డి-తెలంగాణ
- అనుగోలు రంగశ్రీ -తెలంగాణ
- బూరగాపు ఆనందసాయి -తెలంగాణ
- సుచిత్ర ఎల్ల -తెలంగాణ
- కృష్ణమూర్తి - తమిళనాడు
- పి.రామ్మూర్తి -తమిళనాడు
- దర్శన్. ఆర్.ఎన్-కర్ణాటక
- జస్టిస్ హెచ్‌ఎల్ దత్ - కర్ణాటక
- నరేశ్‌కుమార్ - కర్ణాటక
- డా.అదిత్ దేశాయ్ -గుజరాత్
- శ్రీసౌరబ్ హెచ్ బోరా -మహారాష్ట్ర
బీఆర్ నాయుడు ప్రస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.
బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.బీహెచ్ఇఎల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను బీఆర్ నాయుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎంగా ఎన్టీఆర్ కొనసాగాలని కోరుతూ "ప్రజాస్వామ్య పునరుద్ధరణ" పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీలు నిర్వహించిన సమయంలోనే బి.ఆర్ నాయుడు శక్తి వంచన లేకుండా చేసిన కృషితో చంద్రబాబుకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానికంగా ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు.
ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ ప్రపంచ స్థాయి నగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్ధించారు. అమరావతి రాజధాని కోసం బీఆర్ నాయుడు పోరాడారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని సమర్ధించినందుకు వైసీపీ ప్రభుత్వం 70 ఏళ్ల వయసులో బీఆర్ నాయుడుపై రాజద్రోహం కేసులు పెట్టింది.