తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets: భక్తులకు అలర్ట్.. 11న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

Tirumala Darshan Tickets: భక్తులకు అలర్ట్.. 11న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

HT Telugu Desk HT Telugu

10 November 2022, 10:34 IST

    • డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న విడుదల చేయనుంది టీటీడీ. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. 
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు (twitter)

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

Tirumala Special Darshan Tickets For December 2022: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. డిసెంబర్ కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను నవంబర్‌ 11న విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి.. దీని ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 5, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 22,423 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 9,679 మంది తలనీలాలు సమర్పించారు.

సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యంను సులభతరం చేస్తూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రంలో టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగిలిన రోజుల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందిస్తోంది. తిరుమలలో డిసెంబర్ నెలలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశంఉంది.