తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Submerge: పోలవరంలో లక్ష కుటుంబాలకు ముంపు ముప్పు, సగం గిరిజనులే

Polavaram Submerge: పోలవరంలో లక్ష కుటుంబాలకు ముంపు ముప్పు, సగం గిరిజనులే

Sarath chandra.B HT Telugu

08 December 2023, 9:57 IST

google News
    • Polavaram Submerge: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్ష కుటుంబాలకు గోదావరి ముంపు ముప్పును ఎదుర్కొనున్నారు. ఈ మేరకు కేంద్రజలశక్తి సహాయ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. 
పోలవరం ప్రాజెక్టుతో లక్ష కుటుంబాలకు ముంపు ముప్పు
పోలవరం ప్రాజెక్టుతో లక్ష కుటుంబాలకు ముంపు ముప్పు

పోలవరం ప్రాజెక్టుతో లక్ష కుటుంబాలకు ముంపు ముప్పు

Polavaram Submerge: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 1,06,006 కుటుంబాలు ముంపుకు గురి కానున్నట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు లక్షకు పైచిలుకు కుటుంబాలు ప్రాజెక్టు నిర్మాణంతో ముంపుకు గురవుతారని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ ప్రకటించారు.

ముంపుకు గురయ్యే వారిలో 56,504 కుటుంబాలు గిరిజనులకు చెందినవని వివరించారు. లోక్‌సభలో గురువారం తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. ముంపుకు గురయ్యే గిరిజనుల్లో 43,689 కుటుంబాలు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

12,815 కుటుంబాలు ఏలూరు జిల్లాకు చెందినవని ఉన్నాయని పార్లమెంటులో వెల్లడించారు. 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం కింద ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి సగటున రూ.6.86 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

గిరిజన కుటుంబాలకు వారు కోల్పోయిన దానికి సమానమైన భూమి, లేదంటే 2.5 ఎకరాల భూమిని పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు గృహాలు అందివ్వనున్నట్లు వివరించారు. పోలవరాన్ని 2016 సెప్టెంబరు 30న జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత దాని సాగునీటి విభాగం నిర్మాణం కోసం చేసిన ఖర్చును కేంద్రం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. సహాయ, పునరావాసం సహా ప్రాజెక్టు అమలు బాధ్యతను కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వమే చూస్తోందని వెల్లడించారు.sar

తదుపరి వ్యాసం