August 26 Telugu News Updates: సీఎం ఇంటి ముట్టడి యథాతధం - ఏపీ ఉద్యోగ సంఘాలు
26 August 2022, 22:04 IST
- August 26 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
సెప్టెంబర్ 1 సీఎం ఇంటి ముట్టడి - ఏపీ ఉద్యోగ సంఘాలు
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో ఉద్యోగాల సంఘాల చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘ నేతలు… ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
రేపు హైదరాబాద్ కు నడ్డా
రేపు హైదరాబాద్ కు జేపీ నడ్డా రానున్నారు. ఈ క్రమంలో హీరో నితిన్ తో పాటు పలువురు ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు.
గేట్లు మూసివేత
వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar project) క్రస్ట్ గేట్లను శుక్రవారం మూసివేశారు. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కుప్పం ఘటనపై కేసులు నమోదు
కుప్పం ఘటనపై పలు కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ముగ్గురిపై కేసు నమోదైంది. ఇక వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 మందిపై కేసులు నమోదయ్యాయి.
వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ప్రోట్ కాల్ పాటించటం లేదని అన్నారు. ఎంతదూరమైనా వెళ్తానని స్పష్టం చేశారు. 3 ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాడని చెప్పుకొచ్చారు. జగన్ వెంటే ఉంటానని...పక్కకు వెళ్లాల్సివస్తే మద్దిశెట్టిగానే ఉంటానని చెప్పుకొచ్చారు.
జగన్ కు ఊరట
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరుకు నుంచి మినహాయింపు ఇచ్చింది.
సీఎంపై చంద్రబాబు ఫైర్
కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడే ఉంటానని... దమ్ముంటే జగన్ రావాలని సవాల్ విసిరారు. త్యాగాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను కన్నెర్ర చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని హితవు పలికారు.
సభకు హైకోర్టు అనుమతి
రేపటి వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరు కానున్నారు.
చంద్రబాబుకు భద్రత పెంపు
Chandrababu Security: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భద్రత పెంచారు. గురువారం కుప్పంలో జరిగిన ఘటనతో ఎన్ఎస్జీ అలర్ట్ అయ్యింది. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా 10,256 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 10,256 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ బారన పడి 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం…
ap govt announced the ban on plastic flexis: విశాఖ వేదికగా పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
గవర్నర్ తో టీడీపీ నేతల భేటీ
టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. కుప్పంలో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడం వంటి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
వచ్చే నెలలో తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్
టీఎస్ ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లమో హోల్డర్లు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం సెప్టెంబరు 7న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 7 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ రుసుము చె
ఉక్రెయిన్ విద్యార్థుల కేసులో రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
ఉక్రెయిన్‌లో చదివిన విద్యార్థులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సదరు పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 5లోగా జవాబు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొందని న్యాయవాది అల్లంకి రమేష్ తెలిపారు.
యాత్రకు అనుమతివ్వడాన్ని సవాలు చేసిన ప్రభుత్వం
బండి సంజయ్ యాత్రకు అనుమతివ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారించాలని నివేదించింది. యాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని కోర్టుకు నివేదించింది. మధ్యాహ్నం 1-15 గంటలకు ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరపనుంది.
కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. గడిచిన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న గులాం నబీ ఆజాద్ తన రాజీనామా లేఖను సమర్పించారు. 4 పేజీల రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపారు. 2013లో రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా చేసిన ప్రక్రియ నుంచి విలువలకు తిలోదకాలు ఇచ్చారని, సంప్రదాయాలను పక్కన పెట్టారని రాజీనామా లేఖలో ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం రాహుల్ గాంధీయే కారణమని ఆరోపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని అన్నారు.
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం: ముఖ్యమంతి
ఆంధ్ర ప్రదేశ్‌లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చని అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం బాగా అమలవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా ప్రత్నామ్యాయ బ్యాగులు ఉపయోగించాలని అన్నారు.
కాసెపట్లో ప్రారంభం కానున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"
ఇవాళ స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర" తిరిగి ప్రారంభం కానుంది. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు కొనసాగుతుంది. ఇవాళ నాగాపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు.
ఉచితంగా గణేషుడి విగ్రహాల పంపిణీ
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) హైదరాబాద్ నగరంలో గణేషుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. సెప్టెంబరు 30 వరకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారు. కేబీఆర్ పార్క్, గ్రీన్‌లాండ్స్, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, నెక్లెస్ రోడ్, కుందన్ బాగ్, బంజారా హిల్స్ ఆరోగ్య శ్రీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
Holiday for schools in AP: రేపు 27వ తేదీన ఏపీలో పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు ఈనెల 27వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. విద్యా శాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 13న రెండో శనివారం పాఠశాలలు పనిచేసినందున, దానికి బదులుగా నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటించినట్టు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.
మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి భారీ స్పందన
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సముద్ర తీరంలో ప్లాస్టిక్ ఏరివేస్తున్న కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మంత్రులు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖను సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా నడుం బిగించడం విశేషం.
TS ECET Counselling: సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్
పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకెండియర్‌లో ప్రవేశం పొందేందుకు రాసిన టీఎస్ ఈసెట్ కౌన్సెల్సింగ్ ప్రక్రియ సెప్టెంబరు 7న ప్రారంభం కానుంది. ఏడో తేదీ నుంచి 9వ తేదీ వరకు కౌన్సెల్సింగ్ కోసం ఫీజు చెల్లించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 9వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ 9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు సెప్టెంబరు 17న ఉంటుంది.
తిరిగి ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామయాత్ర
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రకు తెలంగాణ పోలీసులు బ్రేక్ వేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
సర్టిఫికెట్ల ప్రదానం
రూ. 460 కోట్ల వ్యయంతో గ్రాడ్యుయేట్లకు మైక్రోసాఫ్ట్ ఇచ్చిన శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి విశాఖలో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు.
సముద్ర తీరంలో మెగా డ్రైవ్
విశాఖ సముద్ర తీరంలో మెగా డ్రైవ్ చేపట్టారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సముద్ర తీరంలో ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం 25 కి.మీ. పొడవునా 40 పాయింట్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం జరిగే ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు.