తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Meets Amith Shah: అమిత్‌ షాతో చంద్రబాబు ఏకాంత చర్చలు..ఎన్డీఏలోకి టీడీపీ?

Chandrababu meets Amith shah: అమిత్‌ షాతో చంద్రబాబు ఏకాంత చర్చలు..ఎన్డీఏలోకి టీడీపీ?

Sarath chandra.B HT Telugu

08 February 2024, 5:24 IST

google News
    • Chandrababu meets Amith shah: టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్‌షాతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. 
అమిత్‌ షాతో భేటీ అయిన చంద్రబాబు (ఫైల్)
అమిత్‌ షాతో భేటీ అయిన చంద్రబాబు (ఫైల్) (twitter)

అమిత్‌ షాతో భేటీ అయిన చంద్రబాబు (ఫైల్)

Chandrababu meets Amith shah: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయిన తర్వాత 11.30గంటలకు అమిత్‌ షా నివాసానికి చేూరుకున్నారు. దాదాపు గంట పాటు ఈ చర్చలు జరిగాయి.

భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. భేటీ ముగియనడానికి పది నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు.

అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు విమానాశ్రయంలో పలువురు నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణం రాజు, కనకమేడల చంద్రబాబుకు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రంమే అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ జరుగుతుందని భావించినా అది ఆలస్యమైంది.

ఎన్డీఏ కూటమిలో చేరినట్టేనా?

అమిత్‌ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టిడిపి అధినేత చంద్రబాబు తో చర్చల పై పెదవి విప్పని బిజేపి వర్గాలు. చర్చల గురించి అధికారికంగా ఏలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బిజేపి వర్గాలు స్పష్టం చేశాయి. చర్చలపై మాట్లాడేందుకు బిజేపి నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. చర్చలు ముగిసిన తర్వాత అమిత్ షా నివాసం నుంచి రామ్మోహన్ నాయుడు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. రాత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేశారు.నేటి ఉదయం హైదరాబాద్ బయల్దేరనున్నారు.

చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాయని చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ - తెలుగుదేశం మధ్య పొత్తు కుదిరితే బీజేపీ గెలిపు అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్‌ షా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

అమిత్‌షాతో భేటీకి ముందు చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీకి దేశప్రయోజనాలు ముఖ్యమైతే... తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కు పోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు.

కొద్ది నెలల క్రితం అమిత్‌ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు.అమిత్‌ షాతో భేటీకి ముందు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ తదితరులు చంద్రబాబుతో చర్చలు జరిపారు.

ఢిల్లీ వచ్చిన చంద్రబాబుతో వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన లావు టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.

తదుపరి వ్యాసం