తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Slams Government For Their Failures

TDP ChandraBabu : రాజకీయంగా వైసీపీ ఫినిష్‌ అయ్యిందన్న చంద్రబాబు నాయుడు

HT Telugu Desk HT Telugu

26 November 2022, 12:32 IST

    • TDP ChandraBabu ఏపీలో రాజకీయ తప్పిదాలతో వైఎస్సార్సీపీ  ఫినిష్ అయ్యిందని   టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలతోనే వైసీపీ ఫినిష్ అయ్యిందన్నారు.  రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో పాటు, వైసీపీ  నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. 
చంద్రబాబు (ఫైల్ ఫొటో)
చంద్రబాబు (ఫైల్ ఫొటో) (twitter)

చంద్రబాబు (ఫైల్ ఫొటో)

TDP ChandraBabu రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రితో సహా వైసిపి నేతలు అంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేవారు. ఓటమి భయం అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. టిడిపి సభల భారీ సక్సెస్ తో వైసిపిలో కలవరపాటు మొదలైందని చంద్రబాబు విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

అంగ, అర్థ బలం సహా ఏదీ తమ ప్రభుత్వాన్ని రక్షించలేదనే వాస్తవాన్ని చాలా మంది వైసిపి నేతలు గుర్తించారన్నారు. ఓటమి భయంతో వైసిపి జిల్లా అధ్యక్షులను కూడా మార్చుకుందన్నారు. టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమానని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే కార్యక్రమాన్ని రోజువారీ మానిటర్ చేస్తామన్నారు.

నేతలు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడితే వారికి నష్టమేనన్నారు. శృంగవరపు కోట, నరసన్న పేట, పెడన ఇంచార్జ్ లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రాజకీయంగా తాము ఫినిష్ అయ్యామని వైసిపి నేతలకు కూడా అర్థం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

పాలనలో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా పార్టీ దారుణంగా దెబ్బతిన్నదన్న విషయం వైసిపి నేతలకు అవగతం అయ్యిందని చంద్రబాబు అన్నారు. విధ్వంసాలు, వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలపై అణిచివేత దోరణి కూడా ప్రభుత్వానికి నష్టం చేసిందని చంద్రబాబు అన్నారు. రాజకీయ మనుగడ కోసం సిఎంతో సహా నేతలు అంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని...లోపల మాత్రం ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తోందని చంద్రబాబు అన్నారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో ముఖాముఖీ భేటీల్లో చంద్రబాబు పలు అంశాలపై తన వద్ద ఉన్న ఫీడ్ బ్యాక్ ను నేతలతో పంచుకున్నారు. అంగ, అర్థ బలం సహా ఏదీ తమ ప్రభుత్వాన్ని రక్షించలేదనే వాస్తవాన్ని చాలా మంది వైసిపి నేతలు గుర్తించారని చంద్రబాబు అన్నారు.

జిల్లా పర్యటనలకు వస్తున్న స్పందనతో వైసిపిలో కలవరపాటు మొదలైందని అన్నారు. వైసిపి జిల్లా అధ్యక్షులను మార్చుకున్న పరిస్థితులపైనా చంద్రబాబు పార్టీ నేతలకు కారణాలు వివరించారు. అధికార పార్టీ బిసి నేతల రేపటి సమావేశం కూడా వైసిపిలో మొదలైన ఆందోళనకు నిదర్శనం అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వంపై నెగటివ్ టాక్ ఎందుకు వస్తుందనే విషయం అధికార పార్టీ నేతలకు కూడా తెలుసని చంద్రబాబు నేతలతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసులను పెట్టుకుని ప్రజలను సైతం అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా అన్ని చోట్లా నిలదీతలే ఎదురవుతున్నాయని చంద్రబాబు అన్నారు. చివరికి పులివెందులలో కూడా జగన్ రెడ్డికి ఎదురుగాలి మొదలైందని చంద్రబాబు చెప్పారు.

ఇప్పటి వరకు 138 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో పార్టీ అధినేత ముఖాముఖీ భేటీలు ముగిశాయి. గత మూడున్నరేళ్ల కాలంలో నియోజకవర్గ ఇంచార్జ్ పనితీరుపై భేటీల్లో భాగంగా సమీక్ష చేశారు. ప్రజల బాధలపై డిసెంబర్ 2 నుంచి పార్టీ తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా చేపట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందరితో సమన్వయం చేసుకుని ఇంచార్జ్ లు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. తాము నిర్వహించే కార్యక్రమాలపై ప్రతి రోజూ అప్డేట్స్ సోషల్ మీడియా అకౌంట్లలో ఉంచడం ద్వారా ప్రచారం కల్పించాలని కూడా చంద్రబాబు నేతలకు సూచించారు.

టాపిక్