తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Cbn : అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు నాయుడు

TDP CBN : అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు నాయుడు

HT Telugu Desk HT Telugu

02 September 2022, 13:36 IST

google News
    • ఎన్నికల పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు.  ఇకపై ఏ ఎన్నిక జరిగినా గెలిచి తీరాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఎన్నికల పొత్తులపై అవసరాన్ని బట్టి సమయానుకూలంగా స్పందిస్తామని ప్రకటించారు. 
రాజకీయ పొత్తులపై మాట్లాడొద్దంటున్న చంద్రబాబు
రాజకీయ పొత్తులపై మాట్లాడొద్దంటున్న చంద్రబాబు (twitter)

రాజకీయ పొత్తులపై మాట్లాడొద్దంటున్న చంద్రబాబు

ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ గెలిచి తీరాలని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయలంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశం లో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్వేషమేనని పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యిందని ఆరోపించారు. రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్ల కార్డు పట్టుకున్నందుకు ఆయనను టార్గెట్ చేసి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీ లక్ష్మిని వేధిస్తున్నారని, కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదని చంద్రబాబు ఆరోపించారు. సమస్యలను ప్రస్తావిస్తే,దాడులు, విధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూవచ్చి చనిపోయిందని, దీనికి సిఎం ఏం సమాధానం చెబుతారని, ది ప్రభుత్వ హత్య కాదా అని నిలదీశారు. వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విదేశీ విద్యను ఆపేశారని, బిసిలకు ఒక్క పథకం లేదని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కు నిధులు లేవని, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు.

సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదని, పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలని, విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారని, జగన్ కు నిద్రలో కూడా టిడిపి నేతలే గుర్తుకు వస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా వైసిపి వాళ్లు వస్తే ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుందని, ఇది టీడీపీ సవాల్ అన్నారు. టీడీపీ నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే..ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.. కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతామని ప్రకటించారు.

పొత్తులపై అప్పుడే మాట్లాడొద్దు….

ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడడం లేదని, పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలన్నారు. ముందు రాష్ట్రాన్ని కాపాడాలని, దానికి అందరూ కలిసి రావాలన్నారు. మేథావులు, ఉద్యోగులు సహా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలని, నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే…..

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిలుగా ఉంటారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం