తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారింది- చంద్రబాబు

Chandrababu : సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారింది- చంద్రబాబు

18 June 2023, 18:06 IST

google News
    • Chandrababu : వైసీపీ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నేరాలపై ప్రజలకు బహిరంగలేఖ రాశారు.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu : ఏపీలో జరుగుతున్న నేరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారిందని ఆరోపించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి సజీవదహనం సహా పలు ఘటనలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. సీఎం జగన్ పనితీరు, ప్రభుత్వ అసమర్థతతో నేరాలు పెరుగుతున్నాయని, నేరగాళ్లకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని ఆక్షేపించారు. మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలను చంంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. మహిళలకు భద్రతలేదని, ఆస్తులకు రక్షణ లేదని, చట్టసభల్లో గౌరవం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, గన్‌ కల్చర్‌ పెరుగుతున్నాయన్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తిని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారం నిదర్శనం అని చంద్రబాబు అన్నారు.

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి-ఎంపీ జీవీఎల్

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని తొమ్మిది ఏళ్లలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన సభలో ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు. అమిత్ షా దగ్గర ఏపీ లా అండ్ ఆర్డర్‌పై పూర్తి నివేదిక ఉందన్నారు.

విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. విశాఖలో భూదందాలు జరుగుతున్నాయన్నారు. ఈ భూ మాఫియాపై సిట్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం జగన్ భూ సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో బాలుడిపై పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుష ఘటన అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం పెరిగిపోయిందన్నారు. వైసీపీ అంటే రాక్షస సంతతి అని ప్రకటించుకోవాలని జీవీఎల్ ఆక్షేపించారు. సీఎం జగన్ మృతుని కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం జగన్ రాజీనామా చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఇసుక, మైనింగ్‌ మాఫియాలపై సీబీఐ విచారణ జరగాలన్నారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా కూడా ఏపీ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, శాండ్, ల్యాండ్, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోతున్నాయని విమర్శలుచేశారు.

తదుపరి వ్యాసం