తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sri Vani Tickets Quota: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. రేణిగుంట విమానాశ్రయంలో మరిన్నిశ్రీవాణి టికెట్లు పెంపు

Sri Vani Tickets quota: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. రేణిగుంట విమానాశ్రయంలో మరిన్నిశ్రీవాణి టికెట్లు పెంపు

21 November 2024, 12:25 IST

google News
    • Sri Vani Tickets quota: టీటీడీ బోర్డు నిర్ణయంత రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి దర్శనం టిక్కెట్ల సంఖ్యను 100నుంచి 200కు పెంచారు. ఎయిర్‌ పోర్ట్‌ కరెంట్‌ బుకింగ్‌లో శ్రీవాణి టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్‌ పాస్‌ ఉన్న భక్తులకు మాత్రమే వీటిని జారీ చేస్తారు. 
రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ల జారీ
రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ల జారీ

రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ల జారీ

Sri Vani Tickets quota: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి గగన మార్గంలో వచ్చే భక్తులు సౌకర్యార్ధం రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి దర్శనం టిక్కెట్ల కోటాను రెట్టింపు చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచారు. ఇటీవల టీటీడీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రేణిగుంట విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. ఈ విధానం నవంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది. మరోవైపు శ్రీవాణి ట్రస్టు ద్వారా విక్రయించే టిక్కెట్ల సొమ్మును శ్రీవారి ఖజానాకు జమ చేయాలని ఇప్పటికే టీటీడీ బోర్డు నిర్ణయించింది.

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

  • మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు.
  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • నవంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు

ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

నవంబరు 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు కోర‌డ‌మైన‌ది.

తదుపరి వ్యాసం