Special Trains : ప్రయాణికులకు అలర్ట్... రాయలసీమ జిల్లాల మీదుగా 6 ప్రత్యేక రైళ్లు
09 November 2024, 13:30 IST
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు వివరాలు పేర్కొన్నారు. ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నవంబర్ 12 నుంచి 24 తేదీల మధ్యలో రాకపోకలు సాగిస్తాయి.
రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు మరో అప్డేట్ వచ్చేసింది.ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 12 నుంచి 24 వరకు వివిధ తేదీల్లో నడుస్తాయమని పేర్కొన్నారు.
1. ఎస్ఎంవీటీ బెంగళూరు-బరౌని స్పెషల్ (06563) రైలు నవంబర్ 12, 19 తేదీల్లో రాత్రి 9.15 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరుతుంది. మరసటి రోజు రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. ఈ రైలు అర్థరాత్రి 12.05 గంటలకు ధర్మవరం, అర్థరాత్రి 12.38 గంటలకు అనంతపురం, తెల్లవారు జామున 2ః50 గంటలకు డోన్, తెల్లవారుజామున 3.48 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. అక్కడ నుంచి తెలంగాణలోని మహబుబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తోంది.
2. బరౌని-ఎస్ఎంవీటీ బెంగళూరు స్పెషల్ (06564) రైలు నవంబర్ 15, 22 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బరౌనీలో బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. తెలంగాణలోని కాజీపేట, కాచిగూడ, మహబుబ్‌నగర్ మీదుగా ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు మీదుగా ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది.
3. యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ స్పెషల్ (06229) రైలు నవంబర్ 13న ఉదయం 7.30 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 9.45 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఉదయం 11.40 గంటలకు ధర్మవరం, మధ్యాహ్నం 12.23 గంటలకు అనంతపురం, మధ్యాహ్నం 2ః20 గంటలకు డోన్, మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. అక్కడ నుంచి తెలంగాణలోని మహబుబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తోంది.
4. ముజఫర్‌పూర్-యశ్వంతపూర్ స్పెషల్ (06230) రైలు నవంబర్ 16న ఉదయం 10.45 గంటలకు ముజఫర్‌పూర్‌లో బయలుదేరి, రెండో రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తెలంగాణలోని కాజీపేట, కాచిగూడ, మహబుబ్‌నగర్ మీదుగా ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు మీదుగా యశ్వంతపూర్ చేరుకుంటుంది.
5. యశ్వంతపూర్-దానాపూర్ స్పెషల్ (06271) రైలు నవంబర్ 14, 21 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ఉదయం 11.40 గంటలకు ధర్మవరం, మధ్యాహ్నం 2ః30 గంటలకు డోన్, మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. అక్కడ నుంచి తెలంగాణలోని మహబుబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా మహారాష్ట్రలోకి అడుగు పెడుతోంది. ఈ రైలు అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆగదు.
6. దానాపూర్-యశ్వంతపూర్ స్పెషల్ (06272) రైలు నవంబర్ 17, 24 తేదీల్లో ఉదయం 8 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి, రెండో రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తెలంగాణలోని కాజీపేట, కాచిగూడ, మహబుబ్‌నగర్ మీదుగా ధర్మవరం, డోన్, కర్నూలు మీదుగా యశ్వంతపూర్ చేరుకుంటుంది. ఈ రైలు అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆగదు.