తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Road Accident: కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు లారీలు ఢీకొని ఆరుగురు దుర్మరణం

Road Accident: కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు లారీలు ఢీకొని ఆరుగురు దుర్మరణం

Sarath chandra.B HT Telugu

14 June 2024, 8:42 IST

google News
    • Road Accident: కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. రెండు వాహనాల డ్రైవర్లతో పాటు ఐషర్‌ లో ప్రయాణిస్తున్న మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. కృత్తివెన్ను మండలంలో ఈ విషాదం జరిగింది. 
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

Road Accident: కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. రెండు లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదస్థలిలో ఐదుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. సీతనపల్లి వద్ద ఉదయం 5 గంటలకు ఘటన జరిగింది.

శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. రెండు రవాణా వాహనాల్లోఒకటి కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, మరొకటి పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న కంటైనర్‌‌లో ఉన్న డ్రైవర్‌ క్లీనర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో గూడ్స్ క్యారియర్ వాహనంలో ఉన్న వారు కూాడా స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

పాండిచ్చేరి నుండి భీమవరంకు రొయ్యల ఫీడ్ తీసుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఐషర్ గూడ్స్‌ వ్యాన్ ఢీకొంది. సంఘటనలో స్థానికులు చొరవ చూపి గాయపడిన వారిని బయటకు తీసారు. అప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు గూడ్స్ క్యారియర్‌ వాహనంలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారు. గూడ్స్‌ వాహనంలో ఉన్నవారిని కూలీలుగా గుర్తించారు. అమలాపురం మండలం తాళ్ళ రేపు నుండి చేపల వేటకు వస్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మిగిలిన వారు తీవ్రంగా గాయపడటంతో ఘటనా స్థలం హృదయ విదారకంగా ఉంది.

పురందేశ్వరి దిగ్భ్రాంతి…

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి చెందడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు

తదుపరి వ్యాసం