Shree Cement : రూ. 2500 కోట్లతో పల్నాడులో భారీ సిమెంట్ ప్లాంట్
22 June 2022, 14:13 IST
- ఏపీలో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో శ్రీ సిమెంట్ కంపెనీ తన తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.
శ్రీ సిమెంట్
ఏపీకి మరో భారీ సిమెంట్ ప్లాంట్ రానుంది. దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌ను రూ.2500 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ ప్రకటించింది. ఇది సంవత్సరానికి 1.5 మిలియన్ టన్నుల క్లింకర్ మరియు 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. .
దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్ టన్నులుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సామర్థ్యంలో 64 శాతం వినియోగించుకుంది. వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అయితే దీనిని డిసెంబర్ 2024 నాటికి అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీ సిమెంట్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీ వెల్లడించింది. మెుత్తం 2,500 కోట్ల పెట్టుబడిని సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
గత ఏడాది డిసెంబర్ 20న ఏపీలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీ సిమెంట్ ఎండీ హెచ్‌ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. ఇందులో భాగంగా పెదగార్లపాడులో భారీ పెట్టుబడితో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీ సిమెంట్ అధికారికంగా ప్రకటించింది.
టాపిక్