తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fir On Jagan: మాజీ సిఎం జగన్‌, ఐపీఎస్‌లు పీవీ సునీల్, పిఎస్సార్‌లపై హత్యాయత్నం కేసు నమోదు, రఘురామ ఫిర్యాదు…

FIR On Jagan: మాజీ సిఎం జగన్‌, ఐపీఎస్‌లు పీవీ సునీల్, పిఎస్సార్‌లపై హత్యాయత్నం కేసు నమోదు, రఘురామ ఫిర్యాదు…

Sarath chandra.B HT Telugu

12 July 2024, 12:01 IST

google News
    • FIR On Jagan: కస్టోడియల్‌ టార్చర్‌పై మాజీ ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ సిఎం జగన్‌తో పాటు మాజీ సిఐడి చీఫ్‌ పీవీ.సునీల్, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్‌లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎంపీ రఘురామకృష్ణరాజు

ఎంపీ రఘురామకృష్ణరాజు

FIR On Jagan: వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కస్టడీలో టార్చర్‌ చేశారనే ఆరోపణలపై మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డితో పాటు మాజీ సిఐడి చీఫ్‌ పీవీ సునీల్, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పిఎస్సార్‌ ఆంజనేయులు, డిఎస్పీ విజయ్‌పాల్‌పై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ సిఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కక్ష కట్టిన జగన్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని రఘురామ ఆరోపించారు. సిఆర్‌పిఎఫ్‌ భద్రతలో ఉండగానే వారిని బలవంతంగా బయటకు పంపి హైదరాబాద్‌ నుంచి గుంటూరు తీసుకువచ్చి తీవ్రంగా హింసించారని ఆరోపించారు. తనను హింసిస్తున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి ఎవరికో పంపారని, వాటిని తాడేపల్లిలో ఉన్న వాళ్లు వీక్షించారని ఆరోపించారు.జగన్‌ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని రఘురామ పలు సందర్భాల్లో ఆరోపించారు.

కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు తీసుకోవాలంటే దాదాపు మూడేళ్లుగా రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కస్టడీలో తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులకు జూన్‌ 10న ఫిర్యాదు చేశారు.

వైసీపీ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదుపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఎంపీ రఘురామను అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు కస్టడీలో టార్చర్‌కు గురి చేశారని ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్‌ అధికారులు పీవీ సునీల్‌తో పాటు సీతారామాంజనేయులు, డిఎస్పీ విజయ్‌పాల్‌, గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిలపై పోలీసు కేసు నమోదు చేశారు.

జూన్‌10న రఘురామ ఫిర్యాదు ఆధారంగా మాజీ సిఎం జగన్‌ సహా మరో ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు చేశారు. భారత న్యాయ సంవిధాన్  సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తదుపరి వ్యాసం