తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fish : 2 కిలోల పులస చేప.. ధరెంత పలికిందో తెలుసా?

Fish : 2 కిలోల పులస చేప.. ధరెంత పలికిందో తెలుసా?

HT Telugu Desk HT Telugu

24 August 2022, 18:25 IST

google News
    • యానాం మార్కెట్‌లో పులస చేపలు రికార్డు ధర పలుకుతున్నాయి. తాజాగా చేపల వేలంలో 2 కిలోల బరువున్న పులస చేప భారీగా ధర పలికింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యానాం మార్కెట్‌లో పులస చేపకు రికార్డు ధర పలికింది. స్థానికంగా చేపల వేలం నిర్వహించారు. 2 కిలోల బరువున్న పులస చేపను పార్వతి అనే మహిళ రూ.19 వేలకు తీసుకున్నారు. ఆ తర్వాత వేరే అతడికి అమ్మేశారు. భైరవపాలానికి చెందిన వ్యక్తి రూ.20 వేలకు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర అని స్థానికులు చెబుతున్నారు.

గోదావరి నదికి ఎదురీదుతూ వెళ్లే పులస చేపల రుచి ఎంతో బాగుంటుంది. వాటి రుచిని ఒకసారి చూస్తే.. జీవితంలో మళ్లీ మర్చిపోలేరు. వాటికి అంత గిరాకీ ఉంటుంది మరి. పుస్తెలు అమ్మి అయినా పులస తినాలనే సామెత కూడా ఉంది. జాలర్ల వలలో ఒక్క చేప పడినా వారి పంట పండినట్టే. దానిని కొనుగోలు చేసేందుకు వందలాదిమంది క్యూ కడుతారు. అందుకే వేలం పాటలు నిర్వహిస్తుంటారు.

పులస చేపలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని అనుకుంటారు. వీటిని కొనేందుకు యానాంలో జనాలు ఎగబడ్డారు. వేలంలో ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గట్లేదు. వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో ఈ పులస చేపలు దర్శనమివ్వడంతో వాటిని సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు చోట్ల పులస చేపలు ఎక్కువగా లభిస్తాయి.

మరోవైపు ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక రీచ్‌ల ఉన్నాయని మత్య్సకారులు చెబుతున్నారు. ఈ కారణంగా గౌతమి కాలువలోకి సముద్రం నుంచి వచ్చే చేపల సంఖ్య తక్కువగా ఉందని అంటున్నారు.

తదుపరి వ్యాసం