తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  President Murmu Ap Tour : ఈనెల 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

President Murmu AP Tour : ఈనెల 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

19 November 2023, 6:33 IST

google News
    • President Droupadi Murmu News : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 22వ తేదీన పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో… అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి టూర్ పై సీఎస్ సమీక్షిస్తూ… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Twitter)

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ…. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడ జరిగే శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ముందుగా వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు,ఎస్పి మాధవ రెడ్డిలతో సీఎస్ మాట్లాడుతూ…. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే బందోబస్తు ఇతర ఏర్పాట్లపై వీడియో లింక్ ద్వారా పాల్గొన్న పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డితో ఆయన సమీక్షించారు.అదే విధంగా రాష్ట్రపతి పర్యటనపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమాచార శాఖకు తగు ఆదేశాలు జారీ చేశారు.అంతేగాక రాష్ట్రపతి వచ్చే మార్గంలో రోడ్లకు ఇరువైపులా ఆహ్వానం పలికే ఆర్చ్ లు, హోర్డింగులు ఏర్పాటు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రపతి పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిఎస్ మాట్లాడుతూ డిఎంఇని స్వయంగా మంగళవారం పుట్టపర్తి వెళ్ళి జిల్లా కలెక్టర్,ఎస్పి తదితర అధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రోటోకాల్ విభాగం ద్వారా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన టూర్ ప్రోగ్రాం సహా ఆహ్వాన కార్డులు సక్రమంగా అందరికీ అందేలా చూడాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ యం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని ఆయన ఆదేశించారు.

ఇంకా సంబంధిత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న ఆయా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీడియో సమావేశంలో డిజీపీపీ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి,శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం