తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawankalyan: ఎన్డీఏ అభ్యర్థులు తరపున మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం, 16,17తేదీల్లో రోడ్‌షోలు…

PawanKalyan: ఎన్డీఏ అభ్యర్థులు తరపున మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం, 16,17తేదీల్లో రోడ్‌షోలు…

15 November 2024, 14:24 IST

google News
    • PawanKalyan: ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు.  రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటించనున్న పవన్ కళ్యాణ్‌  5 సభలు… 2 రోడ్ షోలలో పాల్గొంటారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

PawanKalyan: జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్.డి.ఏ. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారు నిమిత్తం బి.జె.పి. జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. ఇందులో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ అయిదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు.

మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గం.కు. లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.

17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

"యే పవన్ నహీ హై..ఆంధీ(తుఫాను) హై అంటూ కొద్ది నెలల కిందట ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కొణిదెల పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి ప్రధాని మోదీ, అమిత్ షా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ టూర్ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు.

ఎన్నికల ప్రచార బాధ్యతల అభ్యర్ధన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సైతం షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని జనసేన వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రలోని తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికలలోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు.

తదుపరి వ్యాసం