తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Varahi Yatra 4th Phase : ఇవాళ్టి నుంచి పవన్ 'వారాహి యాత్ర' - విజయవంతం చేయాలంటూ Tdp శ్రేణులకు లోకేశ్ పిలుపు

Janasena Varahi Yatra 4th Phase : ఇవాళ్టి నుంచి పవన్ 'వారాహి యాత్ర' - విజయవంతం చేయాలంటూ TDP శ్రేణులకు లోకేశ్ పిలుపు

01 October 2023, 7:03 IST

google News
    • Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన వారాహి నాల్గో విడత యాత్ర ఇవాళ్టి నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. అవనిగడ్డలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ యాత్రకు సంబంధించి నారా లోకేశ్… టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పవన్ వారాహి యాత్ర
పవన్ వారాహి యాత్ర (Janasena Twitter)

పవన్ వారాహి యాత్ర

Janasena Varahi Vijaya Yatra : ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. చంద్రబాబు అరెస్టుతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… సీన్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఇవాళ్టి నుంచి నాల్గో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా… ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను కూడా నియమించింది.

ఇక గతానికి భిన్నంగా ఈసారి యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే పొత్తు ఉంటుందని, కలిసే పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో…. ఈ విడత యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక వారాహి యాత్ర నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన తలపెట్టిన నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. “అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను” పార్టీ కేడర్ కు లోకేశ్ పిలుపునిచ్చారు.

షెడ్యూల్ ఇలా!

అక్టోబర్ 1- అవనిగడ్డలో బహిరంగ సభ -యక్కటి దివాకర్ వీణాదేవి కళాశాల ప్రాంగణం

అక్టోబర్ 2- మచిలీపట్నం నాయకులతో సమావేశం

అక్టోబర్ 3- మచిలీపట్నంలో జనవాణి

అక్టోబర్ 4- పెడన

అక్టోబర్ 5 - కైకలూరు నియోజకవర్గాల్లో పర్యటన

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావటంతో... జైలులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చంద్రబాబుకు బెయిల్ రావటం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నారా లోకేశ్ చుట్టూ కూడా సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే యువగళం పాదయాత్ర ఆగిపోయింది. లోకేశ్ ఢిల్లీలోనే మకాం వేశారు. కొద్దిరోజుల కిందటే రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన పవన్.... అనంతరం లోకేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటన చేశారు. వైసీపీని ఓడించటమే తమ లక్షమ్యని ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ యాత్రకు మద్దతు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. వారాహి యాత్రకు టీడీపీ నుంచి ఎంత మేరకు మద్దతు వస్తుంది..? గతంలో మాదిరిగానే వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తారా..? పొత్తు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా..? చంద్రబాబు అరెస్ట్ అంశంపై ఏ విధంగా స్పందిస్తారనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.

తదుపరి వ్యాసం