తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Angry Pawan Kalyan: విరాళాలిచ్చి.. టిక్కెట్లు డిమాండ్… చెక్కులు వాపస్ చేసిన పవన్ కల్యాణ్

Angry Pawan Kalyan: విరాళాలిచ్చి.. టిక్కెట్లు డిమాండ్… చెక్కులు వాపస్ చేసిన పవన్ కల్యాణ్

Sarath chandra.B HT Telugu

07 February 2024, 9:43 IST

google News
    • Angry Pawan Kalyan: పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో కొందరికి పవన్ కళ్యాణ్ ఝలక్‌ ఇచ్చారు. పార్టీకి విరాళాలిచ్చి ఆ వంకతో  టిక్కెట్లు ఆశిస్తున్న వారికి గట్టి షాక్ ఇచ్చారు. 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Angry Pawan Kalyan: పార్టీ కోసం పనిచేసి టిక్కెట్లు ఆశించిన వారిని కూడా సీట్ల సర్దుబాటు నేపథ్యంలో సర్దుకుపోవాలని జనసేన janasena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ Pawan Kalyan చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ bjp,టీడీపీ tdpలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది.

ఈ క్రమంలో టీడీపీ-బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రయత్నించారు. పవన్ గతంలో చేసిన ప్రయత్నాల్లో మోదీతో పాటు అమిత్‌షా, నడ్డా వంటి వారితో జరిపిన చర్చల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లో ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు టీడీపీతో మాత్రం ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీకి 25అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేనలో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగింది. ఆశావహులు టిక్కెట్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు పార్టీకి విరాళంగా చెక్‌లు cheque ఇచ్చి, తర్వాత మెల్లగా తమకు టికెట్‌ కావాలని అడుగుతుండటంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆగ్రహంAngry వ్యక్తం చేశారు.

‘‘పార్టీకి విరాళాలిచ్చాం కాబట్టి తమకు టికెట్‌ ఇవ్వాలి’’ అంటూ ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కొందరి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. పార్టీ నిర్వహణ కోసం గతంలో విరాళాలు ఇచ్చి.. ఆ తర్వాత రానున్న ఎన్నికల్లో టికెట్‌ కావాలని డిమాండ్లు తెరపైకి తీసుకు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు,

ఇలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పవన్‌ సీరియస్‌ అయ్యారు. జిల్లా బాధ్యులతో పాటు అనుబంధ విభాగాల్లో ఉన్న వారు, ‘ప్రెసిడెంట్‌ టీమ్‌’గా చలామణీలో ఉన్న వారికి పవన్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.

పార్టీకి రకరకాల సందర్భాలలో విరాళాలు ఇచ్చిన వారి వివరాలు తెలుసుకుని, ఆ చెక్కులను వెనక్కి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. పవన్ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయ సిబ్బంది చెక్కులు ఇచ్చిన వారికి ఫోన్లుచేసి, వాటిని తీసుకువెళ్లాలని కోరుతున్నారు. కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన నేతలను కాదని, కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేదని, ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించే అవకాశం లేదని పవన్‌ తేల్చి చెప్పేసినట్టు ఈ సందేశంతో క్లారిటీ వస్తుందని జనసేన నాయకులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఎన్నికల్లో టికెట్‌ ఇస్తానని ఎవరికీ హామీ ఇవ్వలేదని పవన్ కళ్యాన్‌ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రాయలసీమకు చెందిన ఒక నాయకుడు మంగళవారం కలిసి పార్టీకి విరాళం ఇవ్వడానికంటూ చెక్కులతో వచ్చారు. ఆ విషయం మాట్లాడుతూ తనకు, తనతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు జనసేన అభ్యర్థిత్వం కావాలంటూ ప్రతిపాదించారు.

ఈ పరిణామాలపై పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల కోసం ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించనని వారితో తేల్చి చెప్పారు. ఆ చెక్కులను తీసుకుని వెళ్లిపోవాలని వారిని పంపేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. విరాళాల పేరుతో టిక్కెట్ల కోసం ఒత్తిడి చేస్తున్న మరికొన్ని ఘటనలూ ఆయన దృష్టికి వచ్చాయి.

ఇలాంటి పనులను ప్రోత్సహించవద్దని ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ విషయం అందరికీ తెలియజేయాలంటూ పార్టీ నాయకులకు పవన్‌ సూచించారు. టికెట్‌ అభ్యర్థిస్తూ గతంలో వారు పార్టీకి విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్న వారికి చెక్‌లు తీసుకుని వెళ్లిపోవచ్చనే విషయాన్ని తెలియజేయాలని పవన్‌ స్పష్టం చేశారు. కొందరు నాయకులు ఇచ్చిన చెక్‌లను ఇప్పటికే తిప్పి పంపారని జనసేన రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. .

తదుపరి వ్యాసం