తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Tdp: ఏపీలో జనసేన, టీడీపీల బంధం పదేళ్లు కొనసాగాలని పల్లా శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అకాంక్ష..

Janasena TDP: ఏపీలో జనసేన, టీడీపీల బంధం పదేళ్లు కొనసాగాలని పల్లా శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అకాంక్ష..

Sarath chandra.B HT Telugu

08 July 2024, 7:21 IST

google News
    • Janasena TDP: ఏపీలో కూటమి మధ్య స్నేహం పదేళ్ల పాటు కొనసాగించేలా జనసేన, టీడీపీలు సమన్వయంతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్‌, పల్లా శ్రీనివాస్ అకాంక్షించారు. పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగేలా శ్రేణుల్ని నడపాలని పవన్ అభిప్రాయపడ్డారు. 
పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

Janasena TDP: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పని తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు.

ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాలలో పార్టీ నాయకులుగాని, కార్యకర్తలుగాని పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమేనని అటువంటివారిపై కూడా చర్యలు తప్పవన్నారు. తొలుత షోకాజ్ నోటీసు జారీ అవుతుంది. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీలోని ప్రతి ఒక్కరు పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకువెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. ఇటీవల జనసేన ప్రజాప్రతినిధుల బంధువులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గోంటున్ననేపథ్యంలో పవన్ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు.

టీడీపీ, జనసేన బంధం పటిష్టంగా నిలవాలి….

రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతల నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు పవన్ నివాసానికి వెళ్లిన పల్లా శ్రీనివాసరావు రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.

రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పోరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్లే, మోడీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జన సైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన ఉత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి కలిసి రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ఉండాలని ఇరువురి నేతల ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను నిరంతరం తమ పర్యవేక్షణలో అనుసరించేలా చూడాలని నిర్ణయించారు.

ఎక్కడైనా బేధాభిప్రాయాలు తలెత్తుతాయన్న సూచనలు కనిపించిన వెంటనే వాటిని సరిదిద్దే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం ద్వారా గత పాలనలో జరిగిన అరాచకాన్ని ప్రజలు మరింతగా అవగతం చేసుకునేలా వ్యవహరించాలని అవగాహనకు వచ్చారు.

తదుపరి వ్యాసం