Govt Jobs 2024 : ఏపీ 'నిట్' నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 125 ఖాళీలు, దరఖాస్తులకు అక్టోబర్ 10 ఆఖరు తేదీ
21 September 2024, 13:27 IST
- NIT AP Recruitment 2024 : టీచింగ్ పోస్టుల భర్తీకి ఏపీలోని నిట్(NIT) నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల పోస్టులు కలిపి 125 ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు అక్టోబరు 10వ తేదీతో పూర్తి కానుంది. https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.
ఏపీ నిట్ లో ఉద్యోగాలు 2024
టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తాడేపల్లిగూడెంలో నిట్(National Institute of Technology) ప్రకటన జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 125 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం కాగా.. అక్టోబర్ 10వ తేదీతో ముగియనున్నాయి.
నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం… అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఉద్యోగాలు 48 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఉద్యోగాలు 20 ఉండగా,. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు 30 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టును బట్టి జీతాలను నిర్ణయించారు. దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వూ ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తే… ఆన్ లైన్ ప్రజేంటేనషన్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తామని నోటిఫికేషన్ లో వివరించారు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తాడేపల్లి గూడెం, ఆంధ్రప్రదేశ్
- ఉద్యోగాల పేరు - టీచింగ్ పోస్టులు
- మొత్తం ఖాళీలు - 125
- దరఖాస్తులకు తుది గడువు- 10 అక్టోబర్ , 2024
- అధికారిక వెబ్ సైట్ - https://www.nitandhra.ac.in/main/index.php
- అప్లికేషన్ లింక్ - https://nitandhra.ac.in/FRP/
ఏపీ గురుకులాల్లో టీచింగ్ పోస్టులు:
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గురుకులాలకు సంబంధించిన ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లలో వివిధ సబ్జెక్టులను బోధించేందుకు.. కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 20వ తేదీలోపు గూగుల్ ఫారంలో వివరాలు నింపి.. అప్లై చేసుకోవాలని.. సెప్టెంబర్ 24న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
మాథ్యమెటిక్స్, మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల బోధనకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు చీపురపల్లి (విజయనగరం), శ్రీకృష్ణాపురం (విశాఖపట్నం), పిఠాపురం (కాకినాడ), ద్యారకా తిరుమల (మశ్చిమ గోదావరి), ఈడుపుగల్లు (కృష్ణా), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), సింగరాయకొండ (ప్రకాశం), కుప్పం (చిత్తూరు), బి.పప్పూర్ (అనంతపురం), చిన్నటేకూరు (కర్నూలు) సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది.
ఈ గూగుల్ లింక్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSf8_JSJQp3A3UjZGPKGMD-547asbI1zfXhsKBmwnbfc-9Bg4w/viewform పై క్లిక్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుంది.