Kotamreddy Issue : తప్పు చేస్తే నేనే నాశనమైపోతా…కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
03 February 2023, 11:00 IST
- Kotamreddy Issue అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ సమస్యను డైవర్ట్ చేస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నెల నుంచి తనపై అనుమానం పెరిగిందని, అందుకే ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. తన్న స్నేహితుడితో ట్యాపింగ్ జరగలదేని బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ పక్కదారి పట్టిస్తున్నారని, తాను తప్పు చేసి ఉంటే సర్వనాశనం చేేయాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Issue ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్సీీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ అంధశంపై విచారణను పక్కదారి పట్టిస్తున్నారని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తాను సాక్ష్యాధారాలు బయటపెట్టినా ఆ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన స్నేహితుడిపై ఒత్తిడి చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తన స్నేహితుడితో చెప్పిస్తారన్నారు. అధికారాన్ని వదులుకుని తాను ప్రతిపక్షంలోకి వచ్చానని, వైసీపీ మాత్రం విచారణ జరగకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్ ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని తన పిల్లల ప్రస్తావన ఎందుకన్నారు. వైసీపీ పెద్దలకు నెల రోజుల నుంచి తనపై అనుమానంపెరిగిందని ఆరోపించారు.
ఎవరు ఎక్కడ, ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో ఎన్నికల సమయంలో తెలుస్తుందన్న కోటంరెడ్డి, నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా వచ్చిన ఆదాల పాడైపోయిన రోడ్లను బాగు చేయించాలని ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరారు.బారా సాహెబ్ దర్గాకు ఆర్ధిక శాఖ నుంచి నిధులు రావట్లేదని వాటిని ఇప్పించాలన్నారు. వాగులేటి పాడు జగనన్న కాలనీలో కనీససదుపాయాలు, దర్గమెట్టలో బీసీ భవన్, అంబేడ్కర్ భవనాలను నిర్మించాలని, రూరల్‌లో ముస్లిం భవన్ నిర్మాణం చేయాలని కోరారు. ఆమంచర్ల డీప్ కట్ పూర్తి చేయాలని, ఏపీఐఐసి సేకరించిన 500ఎకరాలకు క్లియరెన్స్ ఇప్పించాలని, పొట్టేలుపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
నాలుగేళ్లుగా నియోజక వర్గంలో తనకు సాధ్యపడని పనులు పూర్తి చేయాలని ఆదాలను కోటంరెడ్డి కోరారు. కొమ్మలపూడి లిప్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయించాలని కోరారు. పది కోట్లు నిధులు విడుదల చేసినా, కాంట్రాక్టరుకు డబ్బులు ఇవ్వకపోవడంతో 70శాతం పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలన్నారు. అధికార పార్టీ ఇన్‌ఛార్జికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అధికార పార్టీకి దూరంగా ఉన్న శాసనసభ్యుడిగా తాను కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
రాజీనామాకు సవాలు చేసిన మాజమంత్రి…
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డికి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ సవాల్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరగలేదని, ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేసి స్పీకర్ దగ్గరకు వెళ్దామన్నారు. ఫోన్ టాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే తాను రాజీనామాను యాక్సెప్ట్ చేస్తానని, ఫోన్ టాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే శ్రీధర్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి పై శ్రీధర్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. జనవరి 27న ఎమ్మెల్యే కోటంరెడ్డి కి టిడిపి టికెట్ ఖరారు అయ్యిందని, పార్టీని వీడే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము అని, ఆయనకు ప్రాణహాని ఏముంటుందని ప్రశ్నించారు.
టాపిక్