తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Redbook Mandate: ఏపీలో రెడ్‌బుక్‌ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామన్న నారా లోకేష్,

Redbook Mandate: ఏపీలో రెడ్‌బుక్‌ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామన్న నారా లోకేష్,

Sarath chandra.B HT Telugu

16 August 2024, 13:48 IST

google News
    • Redbook Mandate: ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏపీలో  రెడ్‌బుక్‌ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు. జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్‌ పత్రాలు తన పేరు మీదకు మార్చుకుని అమ్మేశారని వాటి మీద చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు.లిక్కర్, ఇసుక దందాలపై కూడా చర్యలుంటాయన్నారు. 
అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో నారా లోకేష్‌తో మాట్లాడుతున్న వృద్ధురాలు
అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో నారా లోకేష్‌తో మాట్లాడుతున్న వృద్ధురాలు

అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో నారా లోకేష్‌తో మాట్లాడుతున్న వృద్ధురాలు

Redbook Mandate: ఎన్నికల సమయంలో ప్రతి ఊళ్లో రెడ్‌ బుక్‌ మీద ప్రజలకు తాను హామీ ఇచ్చానని, ప్రజలకు ఎర్ర బుక్ చూపించి ప్రతి తప్పుపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చానని, ఆ మాటల్ని ఎన్నికల్లో ప్రజలు నమ్మారని, రెడ్‌ బుక్‌ మ్యాండేట్ ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. మంగళగిరి నియోజక వర్గంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన లోకేష్‌ రెడ్‌ బుక్‌ మీద స్పష్టత ఇచ్చారు.

లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా?

చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందిపెట్టిన వారిని వదలిపెట్టనని ఆనాడు నేను స్పష్టంగా చెప్పానని జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని లోకేష్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు. లిక్కర్, ఇసుక దందాలపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అడ్డగోలుగా ప్రజా సంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఊరారా చూపించానని ప్రజలు మాకు క్లియర్ మాండేట్ ఇచ్చారని ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారని చెప్పారు. కక్షసాధింపుల ఆలోచన లేదని, అధికారులందరినీ తీసేయాలనే ఆలోచన లేదు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామన్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖలో కూడా పెద్దఎత్తున కుంభకోణాలు జరిగాయని, స్కూల్ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి. దీనిపై కమిటీ వేస్తామన్నారు.

ఓటమి తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాలేదు

ఎమ్మెల్సీ ఎన్నికలపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఎన్డీయే కూటమికి 164 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టిన తర్వాత కూడా వైసీపీకి బుద్ధిరాలేదన్నారు. ఎవరైనా కూటమిలో చేరాలంటే రాజీనామా చేసిన తర్వాతనే చేర్చుకోవాలని స్పష్టంగా చంద్రబాబునాయుడు చెప్పారన్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిగాయో చూశామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఇంట్లో కట్టేసి, హౌస్ అరెస్ట్ లు చేశారని అడ్డగోలుగా రిగ్గింగ్ చేశారన్నారు.ఎమ్మెల్సీ ముఖ్యం కాదని రాజీనామా తర్వాతనే ఎవరినైనా కూటమిలో చేర్చుకుంటామన్నారు.

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని లోకేష్ గుర్తు చేశారు. 2024 ఎన్నికల సమయంలో బాబు సూపర్-6 హామీలతో పాటు అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోగానే అన్న క్యాంటీన్ల ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నామన్నారు.

మొదట 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని మిగతా వాటిని కూడా యుద్దప్రాతిపదికన ప్రారంభిస్తామన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఒకే ఒక్క సంతకంతో అన్న క్యాంటీన్లను మూసేశారని, దీనిపై కౌన్సిల్ లో నేను నిలదీయగా.. అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు. కానీ తర్వాత దాని ఊసే లేదన్నారు. ప్రశ్నిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు.

తిరుమలలో మొట్టమొదటి సారిగా అన్న ఎన్టీఆర్ అన్నదానం ప్రక్రియను ప్రారంభించారని, దాతలు ఆనాడు రూ.3కోట్లు ఇస్తే దానికి ఇప్పుడు దాదాపు రూ.1800 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు అన్నదానం ట్రస్ట్ కు ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు మారినా మూడు పుటలా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో శాశ్వతంగా అన్న క్యాంటీన్లు నడవాలనేది లక్ష్యం అన్నారు. ఇందుకోసం పారదర్శకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

తదుపరి వ్యాసం