తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh: ఏపీ సచివాలయంలో మానవ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్, డిఎస్సీ విధి విధానాలపై తొలి సంతకం

Nara lokesh: ఏపీ సచివాలయంలో మానవ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్, డిఎస్సీ విధి విధానాలపై తొలి సంతకం

Sarath chandra.B HT Telugu

24 June 2024, 10:15 IST

google News
    • Nara lokesh: ఏపీ సచివాలయంలో మంత్రి నారా లోకేష్  బాధ్యతలు చేపట్టారు.  సెక్రటేరియట్‌ 4వ బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Nara lokesh: సచివాలయంలోని 4వ బ్లాక్‌లో మంత్రిగా నారాలోకేష్‌ బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు.  సెక్రటేరియట్‌ 4వ బ్లాక్‌ రూమ్ నంబర్ - 208‌లోని ఛాంబర్ లో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్‌లో కూర్చునే ముందు సీటుపై ఉంచిన టవళ్లను లోకేష్ స్వయంగా తొలగించారు.

రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ - 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. 

మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. 

బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.

తదుపరి వ్యాసం