తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal News : ఆస్తి పంపకాల తర్వాతే అంత్యక్రియలు, తండ్రి మృతదేహం వద్ద కొడుకుల పంచాయితీ!

Nandyal News : ఆస్తి పంపకాల తర్వాతే అంత్యక్రియలు, తండ్రి మృతదేహం వద్ద కొడుకుల పంచాయితీ!

27 August 2023, 15:05 IST

google News
    • Nandyal News : తండ్రి మృతదేహం వద్దే ఆస్తి కోసం కొడుకులు గొడవకు దిగారు. ఆస్తి పంపకాలు తేలే వరకూ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమంటున్నారు.
నంద్యాలలో అమానవీయ ఘటన
నంద్యాలలో అమానవీయ ఘటన

నంద్యాలలో అమానవీయ ఘటన

Nandyal News : ఆస్తి కోసం రక్త సంబంధాలు తెంచుకుని తన్నుకుంటున్న రోజులివి. తండ్రి చనిపోతే.. కాష్టం కాలేలోపు ఆస్తి పంపకాలపై పంచాయితీ మొదలవుతున్నాయి. ఇలాంటి ఘటనే నంద్యాలలో చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన వైసీపీ నేత పట్టా వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన అంత్యక్రియల విషయంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం పట్టా వెంకటేశ్వర్లు ముగ్గురు భార్యలు, వారసుల మధ్య వివాదం మొదలైంది. ఆస్తి పంచాయితీ తేలే వరకూ తండ్రి మృతదేహాన్ని కదలనివ్వబోమని మొదటి, రెండో భార్యల వారసులు అడ్డుపడ్డారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఎంతగా సర్ది చెప్పినా వారసులు ఖాతరు చేయకుండా ఆస్తి పంపకాల కోసం పట్టుబట్టారు. దీంతో పట్టా వెంకటేశ్వర్లు అంత్యక్రియలపై గందరగోళం నెలకొంది.

ఆస్తి పంపకాల తర్వాతే అంత్యక్రియలు

వైసీపీ నేత పట్టా వెంకటేశ్వర్లుకు 15 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంత్యక్రియల పూర్తైతే తమను పట్టించుకోరని రెండు, మూడో భార్య వారసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆస్తి పంపకాల తర్వాతే అంత్యక్రియలు అంటూ పట్టుబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అంత్యక్రియల నిర్వహణ కోసం ఇతర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

ముగ్గురు భార్యల, ఆరుగురు సంతానం

నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో ఉంటున్న పట్టా వెంకటేశ్వర్లు రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య వెంకట సుబ్బమ్మ కాగా ఆమెకు మల్లికార్జున, పుల్లయ్య అనే ఇద్దరు కుమారుడు ఉన్నారు. రెండో భార్య బొజ్జమ్మకు లక్షేశ్వరి,సుబ్బమ్మ అనే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. మూడో భార్య లక్షీదేవీకి వరలక్షీ, ప్రసాద్ అనే కుమారుడు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకటేశ్వర్లు రెండో భార్య బొజ్జమ్మకు రెండో సంతానం కలిగాక, ఆమె మృతి చెందింది. ఆ ఇద్దరు ఆడపిల్లలను పట్టా వెంకటేశ్వర్లు చూసుకొనేవాడు. వెంకటేశ్వర్లుకు మొదటి భార్య వెంకట సుబ్బమ్మ గొడవల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. రెండో భార్య బొజ్జమ్మ మృతి చెందడంతో వెంకటేశ్వర్లు మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి చేసుకున్నా..పిల్లల బాగోగులు, పెళ్లిళ్లు అన్నీ వెంకటేశ్వర్లు చూసుకున్నాడు. ఆస్తి విషయంలో వారసుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆస్తి కోసం రక్త సంబంధాలను పక్కన పెట్టి మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగారు. ఆస్తి పంపకాలు తేలేవరకూ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయమని అంటున్నారు.

తదుపరి వ్యాసం