తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mla Vasantha Krishna Prasad : బూతులు తిడితేనే వైసీపీలో పదవులు, రెండ్రోజుల్లో టీడీపీలో చేరుతున్నా-వసంత కృష్ణ ప్రసాద్

Mla Vasantha Krishna Prasad : బూతులు తిడితేనే వైసీపీలో పదవులు, రెండ్రోజుల్లో టీడీపీలో చేరుతున్నా-వసంత కృష్ణ ప్రసాద్

26 February 2024, 17:15 IST

    • Mla Vasantha Krishna Prasad : తమిళనాడులో లాగా వంగి వంగి దండాలు, బూతులు మాట్లాడితే తెలుగు ప్రజలు సహించరని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మరో రెండ్రోజుల్లో టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు.
వసంత కృష్ణ ప్రసాద్
వసంత కృష్ణ ప్రసాద్

వసంత కృష్ణ ప్రసాద్

Mla Vasantha Krishna Prasad : మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) రెండ్రోజులో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. మైలవరం నియోజకవర్గంలోని తన మద్దతుదారులు, కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానన్నారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ(TDP)లో చేరతానన్నారు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని తెలిపారు. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేని(Devineni Uma)తో కలిసి అన్నీ విషయాలతో మాట్లాడతానన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ పై వ్యక్తిగతంగా దూషించాలని సీఎం జగన్‌ చెప్పారన్నారు. మైలవరం(Mylavaram) టికెట్‌ ఇస్తామంటూనే టీడీపీ నేతలపై దూషణలు చేయమన్నారన్నారు. వైసీపీ(Ysrcp)లో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మైలవరం టీడీపీ ముఖ్యనాయకులను కలిసి మాట్లాడనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. వైసీపీపై విమర్శలు చేసిన వసంత కృష్ణ ప్రసాద్... చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఏపీలో అభివృద్ధి మళ్లీ చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

వంగి వంగి దండాలు ఇక్కడ కుదరవ్

తమిళనాడులో లాగా ఇక్కడ నాయకులు వంగి వంగి దండాలు, పాదాభివందనాలు, బూతులు మాట్లాడితే ప్రజల సహించరన్నారు. మైలవరం నియోజకవర్గం అభివృద్ధి కేశినేని నాని చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న వైసీపీ... మైలవరం ఇన్ ఛార్జ్ గా మరొకరిని నియమించింది. దీంతో ఈసారి టికెట్ లేదని పరోక్షంగా వసంతకృష్ణ ప్రసాద్ కు చెప్పింది. ఈ పరిణామాలతో ఆయన వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. రెండ్రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

టీడీపీలో చేరిన పార్థసారథి

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) సోమవారం నారా లోకేశ్(Nara Lokesh) సమక్షంలో టీడీపీలో చేరారు. నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి పార్థసారథిని టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ... వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు లేదని గ్రహించే ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. బలహీన వర్గాలకు వైసీపీ అవమానాలే ఎదురవుతున్నాయన్నారు. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోనన్నారు. నూజివీడులో అందరిని కలుపుకుని ముందు వెళ్తామనన్నారు. కొసులు పార్థసారథితో పాటు వైసీపీ నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ తొలి జాబితా(TDP First List)లో పార్థసారథికి ఏలూరు జిల్లా నూజివీడు టికెట్ ను చంద్రబాబు ప్రకటించారు.

తదుపరి వ్యాసం