తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Vijayasai : విశాఖ రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తానన్న సాయిరెడ్డి

MP Vijayasai : విశాఖ రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తానన్న సాయిరెడ్డి

HT Telugu Desk HT Telugu

30 September 2022, 9:50 IST

google News
    • MP Vijayasai విభజన హామీల్లో భాగంగా విశాఖపట్నానికి రైల్వే జోన్‌ రాకపోతే  రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. విభజన హామీల అమలుపై ఢిల్లీలో ఏర్పాటైన సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యపడదని ప్రకటించారనే వార్తల నేపథ్యంలో  ఎంపీ సాయిరెడ్డి జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
రైల్వే జోన్‌ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించిన సాయిరెడ్డి
రైల్వే జోన్‌ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించిన సాయిరెడ్డి (twitter)

రైల్వే జోన్‌ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించిన సాయిరెడ్డి

MP vijaya sai reddy రాష్ట్ర విభజన హామీల్లో భాగమైన విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు ఎంపీ సాయిరెడ్డి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని, కొన్ని పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలు ప్రచురించాయని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ రైల్వే జోన్ రాకపోతే నేను రాజీనామా చేస్తానని, రైల్వే జోన్ వస్తే అవాస్తవాలు ప్రచురించిన పత్రికల యజమానులు బహిరంగ క్షమాపణలు చెప్పి వారి పత్రికలను తమకు అప్పగిస్తారా అని సవాలు విసిరారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటం చేస్తోందని, కులోన్మాదంతోనే కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తూ అవాస్తవాలు ప్రచురిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై నిర్ధిష్ట ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రతి అంశంలోనూ ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా అడుగులు వేస్తోందని చెప అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైనదిగా పలు సర్వేలు, వచ్చిన అవార్డులు రుజువు చేశాయని అన్నారు. విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి కల్పించడం, గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడం, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు నిర్మాణంతో ఎగుమతులు పెంపుపై దృష్టి సారించడం వంటివి అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోందని అన్నారు. రూ 72188 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిందని, ఎక్కడా లేని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తోందని అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం