తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rape On Boy | బాలుడిని అక్కడకు పంపిన తల్లిదండ్రులు.. రేప్ చేసిన పాస్టర్

Rape On Boy | బాలుడిని అక్కడకు పంపిన తల్లిదండ్రులు.. రేప్ చేసిన పాస్టర్

HT Telugu Desk HT Telugu

30 March 2022, 21:09 IST

google News
    • గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నమ్మి వదిలి వెళ్తే.. బాలుడిపై లైంగిక దాడి చేశాడో పాస్టర్. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు.. తమ బిడ్డకు మంచి జరగాలని.. దేవుడి సన్నిధిలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడికి పంపించాలో.. అర్థం కాలేదు. తెలిసిన వారి ద్వారా.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్ లోని కల్వరి ప్రార్థన మందిరం గురించి సమాచారం అందింది. అయితే.. 9 సంవత్సరాలు ఉన్న తమ బిడ్డను అక్కడకు పంపాలనుకున్నారు. 2021 మే 3న అక్కడ వదిలి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆ బాలుడు అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడేవాడు.

ఇటీవల తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడుతూ.. ఇంటికి వస్తానని ఏడుస్తున్నాడు. సరేనని తీసుకెళ్లారు. అయితే బాలుడు కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటం గమనించారు. ఏమైందని అడగ్గా అసలు విషయం చెప్పాడు. పాస్టర్ అహరోన్.. తనపై.. లైంగిక దాడి చేశాడని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులలు ఫిర్యాదు చేశారు. పాస్టర్​పై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పాస్టర్ ను రిమాండ్ కు తరలించారు. తెలియని వారి దగ్గరకు పంపించి.. పిల్లల జీవితాలను నాశనం చేయోద్దని పోలీసులు సూచించారు.

దివ్యాంగ బాలుడిపైనా లైంగిక దాడి

మహారాష్ట్ర పూణెలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలానికి చెందిన దంపతులు పూణెలో ఉంటూ పని చేస్తున్నారు. బతుకుదెరువు కోసం కూలీ పనులు.. చేసేవారు. ముగ్గురు సంతానం కాగా.. అందులో రెండో బాలుడు దివ్యాంగుడు.. తల్లిదండ్రులు బాలుడిని పాఠశాలకు పంపలేదు. తల్లిదండ్రులు రోజు కూలీ పనులకు వెళ్తూ.. బాలుడిని ఇంటి వద్దే ఉంచేవారు. రోజులాగే ఇటీవల కూడా.. తల్లిదండ్రులు పనికి వెళ్లారు. బాలుడు ఇంటి దగ్గరే ఉన్నాడు.

బాలుడు నివాసం ఉండే.. ఇంటి పక్కన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. యూపీకి చెందిన అతడు.. మరో వ్యక్తితో బాలుడిని బయటకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిపై మరికొందరితో కలిసి లైంగిక దాడి చేసి.. దాడి చేశారు. అనంతరం చంపేసి.. గోనే సంచిలో బాలుడి మృతదేహాన్ని పెట్టారు. దగ్గరలోని.. చెత్త కుండిలో పడేస్తుండగా.. సెక్యురిటీ గార్డ్ చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అరెస్టు చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం