Poverty Index | ఆంధ్రప్రదేశ్ : బహుముఖ పేదరికంలో కర్నూలు మొదటి స్థానం
05 May 2023, 15:27 IST
- నీతి ఆయోగ్ రూపొందించిన బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్)లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో విభిన్న రంగాల్లో 12.31 శాతం మంది పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది.
నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ నివేదిక
బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MDPI)లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ను బేస్ లైన్‌గా తీసుకుని ఈ నివేదికను రూపొందించి నవంబరు 26న ఆవిష్కరించింది.
కేవలం ఆదాయం ప్రాతిపదికన కాకుండా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు తదితర మూడు కేటగిరీలను ఎంచుకుని, వీటిలో విభిన్న సూచీలకు స్కోర్ కేటాయించింది. ఆరోగ్యంలో పౌష్ఠికాహారం, శిశు, కౌమారదశ మరణాలు, శిశు ఆరోగ్యం సూచీలకు, అలాగే విద్యలో పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు సూచీలకు స్కోరు ఇచ్చింది.
అలాగే జీవన ప్రమాణాలలో వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, నివాస గృహం, ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలు తదితర సూచీలకు స్కోరు కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అంశాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా
ఏ జిల్లాలో ఎక్కువ పేదరికం ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లో మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ప్రకారం అత్యంత ఎక్కువగా పేదరికం ఉన్న జిల్లాలు కర్నూలు, విజయనగరం, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం.
ఈ మొదటి ఐదు జిల్లాల్లో మూడు ఉత్తరాంధ్రవే కావడం గమనార్హం. అలాగే రాయలసీమలోని కర్నూలు మొదటి స్థానంలో ఉంది. గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేదరికం తక్కువగా ఉంది.
జిల్లాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా
బహుముఖ పేదరిక సూచీలో రాష్ట్రాల స్థానం ఇలా..
కేంద్ర పాలిత ప్రాంతాల్లో బహుముఖ పేదరికం అనుభవిస్తున్న జనాభా
టాపిక్