తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Newborn Baby: నర్సు వేషంలో పసికందు కిడ్నాప్, గంటల వ్యవధిలో చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

Newborn Baby: నర్సు వేషంలో పసికందు కిడ్నాప్, గంటల వ్యవధిలో చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు

HT Telugu Desk HT Telugu

15 July 2024, 6:23 IST

google News
    • Newborn Baby: కృష్ణా జిల్లాలో న‌ర్స్ వేషంలో వ‌చ్చి మూడు రోజుల ప‌సికందును అప‌హ‌రించడం కలకలం రేపింది. ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన శిశువును  గంట‌ల వ్య‌వ‌ధిలోనే  పోలీసులు గుర్తించారు. 
నర్సు వేషంలో బాలికను అపహరిస్తున్న మహిళ
నర్సు వేషంలో బాలికను అపహరిస్తున్న మహిళ

నర్సు వేషంలో బాలికను అపహరిస్తున్న మహిళ

Newborn Baby: కృష్ణా జిల్లాలో న‌ర్స్ వేషంలో వ‌చ్చి మూడు రోజుల ప‌సికందు అప‌హ‌ర‌ణ‌ గురైంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు గంట‌ల వ్య‌వ‌ధిలోనే చేధించారు.

కృష్ణా జిల్లాలో న‌ర్స్ వేషంలో వ‌చ్చి మూడు రోజుల ప‌సికందును ఒక మ‌హిళ అప‌హ‌రించింది. దీన్ని పోలీసులు గంట‌ల వ్య‌వ‌ధిలోనే చేధించారు. ఈ ఘ‌ట‌న జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో గైనిక్ వార్డులో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా ఘంట‌సాల మండ‌లం శ్రీ‌కాకుళం గ్రామానికి చెందిన స్వ‌రూప రాణి అనే మ‌హిళ మ‌గ శిశువుకు జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌న్మ‌నిచ్చింది. శ‌నివారం ఆసుప‌త్రిలోని గైనిక్ వార్డులో రాత్రి 1ః30 గంట‌ల‌కు న‌ర్స్ వేషంలో గుర్తు తెలియ‌ని మ‌హిళ వెళ్లింది. ఆ మ‌హిళ మూడు రోజుల మ‌గ‌పిల్లావాడిని తీసుకుపోయింది. దీంతో స‌మాచారాన్ని పోలీసులు తెలిపారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేసును ఛేదించారు.

ఇంగ్లీష్‌ పాలెంకు చెందిన తమ్మిశెట్టి లక్ష్మీ అనే మహిళ నర్సు వేషంలో ఆస్పత్రిలోకి వచ్చి శిశువును అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది సహకారంతోనే శిశువును అపహరించినట్టు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ సహకారంతోనే మహిళ శిశువును అపహరించి ఉండొచ్చని భావిస్తున్నారు.

జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని భ‌ద్ర‌తా లోపం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ శిశువును అప‌హ‌రించిన మ‌హిళ‌ను గుర్తించి సుర‌క్షితంగా బిడ్డ‌ను త‌ల్లి వద్ద‌కు చేర్చారు. దీంతో పోలీసుల‌ను అక్క‌డి వారు అభినందించారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆసుప‌త్రి అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేసిన సూపరింటెండెంట్‌ ముగ్గురు స్టాఫ్‌ నర్సులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపసై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సూది మందు విక‌టించి మ‌హిళ మృతి

శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని త‌న‌క‌ల్లు మండ‌లం కొక్కంటి గ్రామంలో సూది మందు విక‌టించి మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాల‌నీకి చెందిన ఉత్త‌మ్మ (50) మ‌హిల‌కు గ‌త వారం రోజుల నుండి తీవ్ర జ్వోరం ఉంది. దీంతో ఉత్త‌మ్మ ఆదివారం కొక్కంటి క్రాస్‌లోని ఆర్ఎంపీ అబ్దుల్లా వ‌ద్ద‌కు వెళ్లింది.

ఆమెకు ఆర్ఎంపీ డాక్ట‌ర్ సూది మందు ఇచ్చారు. కొద్ది సేప‌టికే ఆమె అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆమెను త‌న‌క‌ల్లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందింది. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేకరించారు. అలాగే ఆర్ఎంపీ డాక్ట‌ర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం