తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kctb Recruitment 2023 : కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

KCTB Recruitment 2023 : కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

18 October 2023, 14:29 IST

google News
    • Kakinada Cooperative Town Bank recruitment: పలు ఉద్యోగాల భర్తీకి కాకినాడలోని కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది.
కాకినాడ సహకార బ్యాంకులో ఉద్యోగాలు
కాకినాడ సహకార బ్యాంకులో ఉద్యోగాలు

కాకినాడ సహకార బ్యాంకులో ఉద్యోగాలు

Kakinada Cooperative Town Bank Recruitment 2023 : ఏపీలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… ఆఫీసర్, లా ఆఫీసర్, క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనుంది. అక్టోబరు 31వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ముఖ్య వివరాలు :

రిక్రూట్ మెట్ సంస్థ - కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్

మొత్తం ఉద్యోగాలు - 33

ఉద్యోగాల వివరాలు - (అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 02 పోస్టులు, మేనేజర్ లా 01, ఆఫీసర్‌ - 09, క్లర్క్ కమ్ క్యాషియర్- 16 ఉద్యోగాలు)

అర్హతలు - పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆయా దరఖాస్తులు నింపి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.

దరఖాస్తులకు తుది గడువు - అక్టోబరు 31, 2023

దరఖాస్తుల రుసుం - ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా -

The Chief Executive Officer

Kakinada Cooperative Town Bank Ltd

Head Office: D.No.11-3-6, Veterinary Hospital Street, Rama Rao Peta,

Kakinada-533004, Kakinada Dist, Andhra Pradesh.

ఎంపిక - అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రిజర్వేషన్లు కూడా ఉంటాయి.

అధికారిక వెబ్ సైట్ - https://kakinadatownbank.in

తదుపరి వ్యాసం