తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rmc Jobs: రంగరాయ మెడికల్, కాకినాడ జిజిహెచ్‌, నర్సింగ్ కాలేజీల్లో ఉద్యోగాలు

RMC Jobs: రంగరాయ మెడికల్, కాకినాడ జిజిహెచ్‌, నర్సింగ్ కాలేజీల్లో ఉద్యోగాలు

Sarath chandra.B HT Telugu

30 January 2024, 7:59 IST

google News
    • RMC Jobs: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీతో పాటు కాకనాడ ప్రభుత్వ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
కాకినాడ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు
కాకినాడ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

కాకినాడ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

RMC Jobs: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్ట్‌ మార్టం అటెండెంట్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,500, పోస్ట్‌మార్టం అటెండెంట్‌కు రూ.15వేల వేతనంగా నిర్ణయించారు.

రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం ఇటీవల అనుమతించిన ఏడు పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వీటిలో ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ టెక్నిషియన్, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నిషియన్, పెర్‌ఫ్యూషనిస్ట్‌, అనస్తీషియా టెక్నిషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, బయో మెడికల్ టెక్నిషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఓటీ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మిగిలిన ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.

కాకినాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్ లైబ్రరేయిన్‌, హౌస్ కీపర్స్‌, వార్డెన్స్‌, అటెండర్స్‌, క్లాస్ రూమ్‌ అటెండర్స్, హెవీ వెహికల్ డ్రైవర్, క్లీనర్స్‌, వ్యాన్ అటెండర్స్‌, అయాలు, ల్యాబ్ అటెండర్స్‌, లైబ్రరీ అటెండర్స్‌ వంటి ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మొత్తం 26 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.

కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో కౌన్సిలర్, ఆడియోమెట్రి టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్‌, స్పీచ్ థెరపిస్ట్, పెర్‌ఫ్యూషనిస్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యార్హతలతో పాటు అనుభవాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు గరిష్ట వయసు 42ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47ఏళ్లుగా నిర్ణయించారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 52ఏళ్ల వరకు అనుమతిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 3వ తేదీలోగా డిడితో కలిపి సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుతో పాటు రూ.400రుపాయలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్‌ నగర్ బ్రాంచ్, కాకినాడ పేరిట చెల్లించాల్సి ఉంటుంది. కాలేజ్ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రంగరాయ కాలేజీ, కాకినాడ పేరిట రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా పంపాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం