తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Iron | ఇళ్లపై ఇనుము భారం.. పాత ధరలకు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కంపెనీలు

Iron | ఇళ్లపై ఇనుము భారం.. పాత ధరలకు ఇవ్వలేమని తేల్చిచెప్పిన కంపెనీలు

HT Telugu Desk HT Telugu

19 February 2022, 6:23 IST

google News
    • గత అక్టోబరు నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలకు టన్ను స్టీలును రూ.62 నుంచి 64 వేలకు ఇస్తున్న కంపెనీలు ఇకపై ఆ రేటుకు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. దీంతో గృహనిర్మాణ అధికారులు టెండర్లకు పిలిచారు.
పెరిగిన స్టీలు ధరలు
పెరిగిన స్టీలు ధరలు (Pixaby)

పెరిగిన స్టీలు ధరలు

రాష్ట్రంలో గృహనిర్మాణాలకు ఉపయోగించే స్టీలు ధర క్రమేణా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లో దాదాపు టన్ను రూ.70 వేలకు పైగా ధర పలుకుతోంది. ఇదిలా ఉంటే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణాలకు సరఫరా చేసే స్టీలును పాత ధరలకే అందించలేమని కంపెనీలు గృహ నిర్మాణ సంస్థకు స్పష్టం చేశాయి. ప్రస్తుతం టన్ను రూ.62 నుంచి 64 వేలక సరఫరా చేస్తున్నాయి. ఇదే ధరకు మరికొంత కాలం సరఫరా చేయాలని అధికారులు సంస్థలను విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. కొన్ని జిల్లాల్లో లబ్దిదారుల నుంచి స్టీలుకు మంచి డిమాండ్ పెరుగుతుండటంతో అధికారులు మళ్లీ టెండర్లు పిలిచారు.

ఈ పథకం కింద ప్రభుత్వం మొదటి విడతగా రూ.15.75 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతోది. పథకం ప్రారంభంలో టెండర్లు పిలిచి టన్న రూ.56 వేల ధర ఖరారు చేసి లబ్దిదారులకు ఇచ్చారు. గత అక్టోబరు వరకు ఇదే ధర కొనసాగింది. ఆ తర్వాత ఏడాది గడువుతో సరఫరాకు కంపెనీలు ముందుక రాలేదు. దీంతో కాలపరిమితిని మూడు నెలలకు కుదించి మళ్లీ టెండర్లు పలించారు. అప్పుడు ధర రూ.56 వేల నుంచి రూ.62-64 వేలకు చేరింది. ఇప్పటి వరకు ఇదే ధరతో సరఫరా చేశారు. బయట మార్కెట్‌లో స్టీలుకు రేటు పెరగడంతో మరికొంత కాలం సరఫరా చేసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో రెండు రోజుల క్రితం మళ్లీ టెండర్లు పిలిచారు అధికారులు. ఈ నెల 25న టెండర్లు ఓపెన్ చేయనున్నారు.

రాబోయే 3 నెలల కాలంలో ఇళ్ల నిర్మాణాల పురోగతికి అనుగుణంగా జిల్లాల నుంచి స్టీలు ఇండెంట్ తెప్పించారు. 34 వేల టన్నుల స్టీలు అవసరముందని జిల్లా అధికారులు అందులో నివేదించారు. ఆ ప్రకారమే టెండర్లను పిలిచారు. పునాది దశలోనే స్టీలు వినియోగించాల్సి ఉన్నందున కోస్తా జిల్లాల నుంచి ఇండెంట్ ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాత స్టాక్ పూర్తి కాగా మిగతా జిల్లాలో కొంతమేర ఉంది. ఇప్పటికే స్టీలు ధర రూ.62 నుంచి 64 వేల కోట్లకు పెరగడంతో లబ్దిదారునిపై అదనంగా 2 నుంచి 3 వేల వరకు భారం పడింది. ఒకవేళ కంపెనీలు అధిక ధరకు కోడ్ చేస్తే ఈ భారం మరింత పెరిగే అవకాశముంది.

తదుపరి వ్యాసం