తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Visakha Tirumala Tour: విశాఖ టు తిరుమల టూర్… చూసే ప్రాంతాలు, ధరలివే

IRCTC Visakha Tirumala Tour: విశాఖ టు తిరుమల టూర్… చూసే ప్రాంతాలు, ధరలివే

04 September 2022, 12:11 IST

    • Visakha Tirumala Package: విశాఖ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 
విశాఖ తిరుమల టూర్,
విశాఖ తిరుమల టూర్, (irctc tourism)

విశాఖ తిరుమల టూర్,

IRCTC Tourism Visakha Tirumala Tour Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా విశాఖ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'WEEKEND TRIP TO TIRUMALA DARSHAN ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

visakha tirumala tour: ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వివరాలు చూస్తే……

Day 01: విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 02: ఉదయం 04.5 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హెటల్ కి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాణిపాకం, శ్రీపురం వెళ్తారు. సొంత ఖర్చులతో భోజనం చేయాల్సి ఉంటుంది. తిరిగి హోటల్ కి చేరుకున్న తర్వాత... రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 03: ఉదయం 6 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత... ఉదయం 7 గంటలకు తిరుమల కొండకు చేరుకుంటారు. శ్రీవారి స్పెషల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత... తిరుచానూరు, శ్రీకాళహస్తికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు.

Day 04: ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

Visakha Tirumala Tour Cost: సింగిల్ షేరింగ్ కు రూ. 17,860 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 11,72 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.10,495 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.

<p>విశాఖ తిరుమల టూర్</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం