Facebook Postings: వైఎస్ షర్మిల,సునీతలపై అసభ్య పోస్టులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు..
15 February 2024, 8:46 IST
- Facebook Postings: పిసిసి అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీతలపై అసభ్య పోస్టులు పెట్టిన విశాఖపట్నం యువకుడిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.
షర్మిలపై ఫేక్ పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు
Facebook Postings: ఏపీలో పతాక స్థాయికి చేరిన సోషల్ మీడియా వార్‌లో ఓ వ్యక్తిని కడప పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులు షర్మిల Sharmila, సునీత Sunitha లక్ష్యంగా సోషల్ మీడియా Social Mediaలో అసభ్య పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పిసిపి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన వెంటనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ కార్యకర్త పేరుతో పోస్టులు వెలువడ్డాయి. ఈ పోస్టులకు తనకు సంబంధం లేదంటూ వైసీపీ YCP సోషల్ మీడియా కార్యకర్త కడప పోలీసుల్ని ఆశ్రయించాడు.
దీనిపై విచారించిన పోలీసులు ఫేక్ పేస్ బుక్ అకౌంట్ Fake Face Book account ఓపెన్ చేసి పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం కు చెందిన వ్యక్తి అని , తెలుగుదేశం పార్టీ అభిమానిగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
వై.ఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె వై.ఎస్. సునీత లపై కొద్ది రోజులు అసభ్య పదజాలంతో పోస్టులు వెలువడుతున్నాయి. వైసీపీ తరపున యాక్టివ్‌గా ఉండే వర్రా రవీంద్ర రెడ్డి Varra పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల నుంచి వీటిని పోస్ట్ చేస్తున్నట్లు కడప పోలీసులకు ఫిర్యాదు అందింది.
తన పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి సోషల్ మీడియా లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని పులివెందులకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డి ఫిర్యాదు చేశాడు. వైఎస్ విజయమ్మ, సునీతా రెడ్డి, షర్మిల రెడ్డిలపై అసభ్యకర పోస్టులు రావడం వెనుక ఉన్న వారిని గుర్తించాలని ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌషల్ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంబించారు.
టెక్నాలజీ ఉపయోగించి ముద్దాయి ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితుడు పోస్టింగుల ఆధారంగా ఫేస్‌బుక్ నుంచి ఐపీ అడ్రస్‌లు సేకరించారు. పక్కా సమాాచారంతో నిందితుడిని విశాఖపట్నం (visakhapatnam) లొని తన నివాసంలో అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం మహారాణిపేట నౌరోజీ రోడ్డుకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ Uday Bhushan పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి షర్మిల, సునీతారెడ్డి, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టేవాడని పోలీసులు వివరించారు. దీనిపై ఫిబ్రవరి 3న పులివెందుల ఠాణాలో ఫిర్యాదు చేశారు.
అసభ్యకర పోస్టుల విషయంపై సునీత కూడా హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసుల సాయంతో ఫేస్‌బుక్ ప్రతినిధుల నుంచి వివరాలు తెప్పించుకొని ఉదయ్ భూషణ్‌ను నిందితుడిగా తేల్చారు. విశాఖపట్నం వెళ్లి ఆయన్ని అరెస్టు చేశారు. వైసీపీ తరపున యాక్టివ్‌గా ఉంటున్న రవీంద్రారెడ్డి పేరుతో సిఎం జగన్ కుటుంబ సభ్యులను తిట్టించాలనే ఉద్దేశంతో ఉదయ్ భూషణ్ ఇలా చేశారని ఏఎస్పీ తెలిపారు.
నిందితుడు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ Real Estate వ్యాపారం చేస్తూ, టీడీపీ సానుభూతిపరుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిందితుడు పినపాల ఉదయ్ ఈ ఏడాది జనవరి 13వతేదీన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. అతని ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సదరు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. ఈ వ్యవహారంపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 3న క్రైం.నెం. 45/2024 కేసు నమోదైంది.