తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions Update: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లపై కీలక అప్టేడ్..ఇకపై మూడో నెలలో అయినా మొత్తం చెల్లిస్తారు

AP Pensions Update: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లపై కీలక అప్టేడ్..ఇకపై మూడో నెలలో అయినా మొత్తం చెల్లిస్తారు

04 November 2024, 7:32 IST

google News
    • AP Pensions Update: ఏపీలో సామాజిక పెన్షన్ల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పలు కారణాలతో వరుసగా రెండు నెలలు పెన్షన్‌ తీసుకోలేకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి మొత్తం చెల్లిస్తారు. ఈ నిర్ణయం  ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడిన వారికి ఊరట కల్పిస్తోంది. 
పెన్షన్ల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్
పెన్షన్ల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ (REUTERS FILE)

పెన్షన్ల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్

AP Pensions Update: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల చెల్లింపులో కీలక నిర్ణయం తీసుకుంది. రకరకాల కారణాలతో కి పెన్షన్లు అందించడంలో నిబంధనలు అడ్డంకిగా మారుతుడంటంతో వారికి ఉపశమనం ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా పెన్షనర్ వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి చెల్లించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక పెన్షన్ల చెల్లింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటి వద్ద పెన్షన్ల చెల్లింపుకు అందుబాటులో లేకపోతే మరుసటి నెలలో బకాయితో కలిపి అందుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఒక నెలలో పెన్షన్ తీసుకోపోతే రెండో నెలలో చెల్లిస్తారు. వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోపోతే మూడో నెలలో మొత్తం మూడు నెలల పెన్షన్ అందిస్తారు. ఎవరైనా రెండు నెలలు వరుసగా పెన్షన్ అందుకోకపోతే మూడో నెలల రూ.12వేలు కలిపి చెల్లిస్తారు. డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.

పెన్షన్ల చెల్లింపుపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 2014-19లో కూడా సామాజిక పెన్షన్ల చెల్లింపులో ఈ విధానం ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఏ నెల పెన్షన్ అదే నెలలో తీసుకోవాలని నిబంధన తెచ్చారు. తాజాగా డిసెంబరు నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేం దుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.

నవంబరు నెలలో పెన్షన్‌ అందుకోలేని వారికి డిసెంబరు 1న రెండు నెలల పెన్షన్‌ కలిపి చెల్లిస్తారు. నవంబరు నెలలో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛను తీసుకోలేదు. ఏపీలో ప్రస్తుతం 64.14 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లను అందిస్తున్నాయి.

వారికి ఊరట దక్కేనా…

మరోవైపు సామాజిక పెన్షన్ల చెల్లింపులో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను జగన్‌ ప్రభుత్వం మినహాయించింది. అప్కోస్ ద్వారా ద్వారా వేతనాలు అందుకునే వారి కుటుంబ సభ్యుల్ని పెన్షన్ల నుంచి మినహాయించారు. ఇలా దాదాపు మూడు లక్షల మందికి పైగా పెన్షన్లను జగన్ ప్రభుత్వం తొలగించింది. ఏ కుటుంబంలో అయినా ప్రభుత్వం ద్వారా కనీస వేతనం అందుకున్నా వారికి పెన్షన్లు రావని స్పష్టం చేశారు.

గ్రామాల్లో ఉండే వృద్ధులు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయారు. రేషన్ కార్డులను విభజించకపోవడంతో లక్షలాది మంది పెన్షన్లకు దూరం అయ్యారు. కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబీకులకు పెన్షన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. రూ.25వేల లోపు వేతనం ఉన్న వారి కుటుంబ సభ్యులకు పెన్షన్లను చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

అనర్హుల ఏరివేత ఎప్పుడు?

వైసీపీ ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు మంజూరయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం కోటి 48లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కుటుంబాల్లో ఐదారు శాతం మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవు.ప్రధానంగా వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే రేషన్ కార్డులకు దూరం అయ్యారు. ఈ క్రమంలో రాజకీయ పలుకుబడి ఉన్న వారు, వాలంటీర్ల అండతో పెద్ద సంఖ్యలో అక్రమ రేషన్ కార్డులు జారీ అయ్యాయనే ఆరోపణలుఉన్నాయి.

తదుపరి వ్యాసం