AP Temperatures Alert : ఏపీలో భానుడి భగభగలు...రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
12 April 2023, 20:53 IST
- Temperatures Updates: రాష్ట్రంలో భానుడి పంజా విసురుతున్నాడు. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఐఎండీ అలర్ట్
Today Andhrapradesh Temperatures : రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 126, ఎల్లుండి 108 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126) :-
అల్లూరి జిల్లాలోని మండలాలు - 8,
అనకాపల్లి 17,
తూ.గోదావరి 13,
ఏలూరు జిల్లాలోని మండలాలు- 4,
గుంటూరు - 06,
కాకినాడ -11
కోనసీమ -01
కృష్ణా - 06
నంద్యాల 01,
ఎన్టీఆర్ 17
పల్నాడు - 02,
మన్యం -12,
శ్రీకాకుళం 05,
విశాఖపట్నం - 02,
విజయనగరం 17,
వైఎస్ఆర్ కడప జిల్లా 4 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తగినంత స్థాయిలో నీరు తాగాలని.. ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. బయటకు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ అధికారులు కూడా చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలో మార్చి 27 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వేడిగాలులు వీస్తున్నాయి.