తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ignou Tee Registration Extended : ఇగ్నో టర్మ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, అక్టోబర్ 27 చివరి తేదీ

IGNOU TEE Registration Extended : ఇగ్నో టర్మ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, అక్టోబర్ 27 చివరి తేదీ

20 October 2024, 15:06 IST

google News
  • IGNOU TEE Registration Extended : ఇగ్నో డిసెంబర్ లో నిర్వహించే టర్మ్ ఎండ్ ఎగ్జామ్ గడువును పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. రూ.1100 ఆలస్య రుసుముతో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చింది.

ఇగ్నో టర్మ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, అక్టోబర్ 27 చివరి తేదీ
ఇగ్నో టర్మ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, అక్టోబర్ 27 చివరి తేదీ

ఇగ్నో టర్మ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, అక్టోబర్ 27 చివరి తేదీ

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) డిసెంబర్ టర్మ్ ఎండ్ ఎగ్జామ్ గడువును మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఆన్ లైన్ లో ఫారమ్ సబ్మిట్ చేసేందుకు అక్టోబర్ 27వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు ఓ ప్రకటనలో ఇగ్నో తెలిపింది.

ఇగ్నో డిసెంబర్ టర్మ్-ఎండ్-ఎగ్జామ్ 2024 గడువు పొడిగింది. రూ. 1100 ఆలస్య రుసుముతో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3, 2024 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ https://www.ignou.ac.in/ ను సందర్శించవచ్చు. ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ కు అక్టోబర్ 27 వరకు అవకాశం కల్పించారు.

డిసెంబర్ లో పరీక్షలకు రాసే విద్యార్థులందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. రాబోయే పరీక్షలకు అర్హతను సాధించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది.

ఇగ్నో టీఈఈ రిజిస్ట్రేషన్ ఇలా

Step 1 : ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ https://www.ignou.ac.in/ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇగ్నో డిసెంబర్ 2024 ఎగ్జామ్ ఫారమ్‌పై క్లిక్ చేయండి

Step 3 : విద్యార్థి వివరాలను నమోదును చేయండి.

Step 4 : సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి, ఎగ్జామ్ ఫీజు చెల్లించండి.

Step 5 : ఆన్ లైన్ ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.

ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ టర్మ్-ఎండ్ పరీక్షలకు అర్హులైన విద్యార్థులు పరీక్ష ఫారమ్ (టీఈ, ప్రాజెక్ట్‌ల సమర్పణ, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్‌లు) సమర్పించడానికి ఆన్‌లైన్ లింక్ అందుబాటులో ఉంది. విద్యార్థులు ముందుగా సూచనలు పూర్తి చదివి, ఫారమ్ నింపాలని ఇగ్నో సూచించింది.

ఏఎన్.యూ పీజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్లు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల డైరెక్టర్ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఏపీ పీజీ సెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంకామ్, ఎంఏ, ఎంఈడీ, ఎంఎస్సీ కోర్సులకు యూనివ‌ర్శిటీ క్యాంపస్ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.

ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లోనే ఈనెల 21న ఉదయం 9.30 నుంచి 11.30వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. యూనివ‌ర్శిటీలో ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు వివరాలకు యూనివ‌ర్శిటీలోని అడ్మిషన్ల కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

తదుపరి వ్యాసం