తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: ఏపీలొ నేడు, రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో విస్తరించిన ఆవర్తనం, కోస్తా జిల్లాలపై ప్రభావం

AP Weather Update: ఏపీలొ నేడు, రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో విస్తరించిన ఆవర్తనం, కోస్తా జిల్లాలపై ప్రభావం

Sarath chandra.B HT Telugu

05 June 2024, 6:27 IST

google News
    • AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. 
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా

AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్సాలు కురువనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

గురువారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి తిరుపతి జిల్లా చిత్తమూరులో 59మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 53మిమీ, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 43.5మిమీ, చిత్తూరు గంగాధరనెల్లూరు 38.5మిమీ,తవణంపల్లెలో 36.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

తదుపరి వ్యాసం