తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Updates: ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలకు హెచ్చరికలు

AP Rains Updates: ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలకు హెచ్చరికలు

14 October 2024, 5:47 IST

google News
    • AP Rains Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కావలి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
బంగాళాఖాతంలొో ఏర్పడిన ఆవర్తనంతో నేటినుంచి ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలొో ఏర్పడిన ఆవర్తనంతో నేటినుంచి ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలొో ఏర్పడిన ఆవర్తనంతో నేటినుంచి ఏపీలో భారీ వర్షాలు

AP Rains Updates: ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వాతావరణ మోడల్స్ అన్ని తిరుపతి - నెల్లూరు - కావలి పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 14 నుంచి 17వ తేదీ వరకు ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడంతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. గత నెలలో విజయవాడలో కుంభవృష్ఠి పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు సహాయక బృందాలను జిల్లాలకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది.

ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని వలన ఈ బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.

భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అలాగే భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండకుడదని సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు.వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రానున్న నాలుగు రోజులు వాతావరణం

14 అక్టోబర్, సోమవారం:

• బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

15 అక్టోబర్, మంగళవారం :

• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

16 అక్టోబర్, బుధవారం :

• పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

17 అక్టోబర్, గురువారం:

• అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

  • సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంది.
  • నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం

  • పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది.

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు. పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తదుపరి వ్యాసం