PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేశారా? ప్రతి నెల రూ.6వేలు గ్రాంటుగా అందుకునే అవకాశం..
17 October 2024, 10:12 IST
- PM Internship: దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఇంటర్న్ షిప్ పథ కానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంపికైతే ఏటా రూ.66 వేలు చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తారు. ఈ పథకాన్ని 2024-25లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తులు
PM Internship: ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ద్వారా యువతకు పలు రంగాల్లో శిక్షణతో పాటు ఉపాధిని కల్పించే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన ఈ వెబ్ పోర్టల్ అక్టోబరు 12 న ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ విద్యార్హత, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో సరైన నైపుణ్యాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. డిగ్రీలు పూర్తి చేసినా వారికి ఎలాంటి నైపుణ్యం ఉండటం లేదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పనిచేయలేని స్థితిలో ఉంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు డిగ్రీ పూర్తి చేసిన వారికి తగిన నైపుణ్యాలు అందించడానికి ఈ పథకం రూపకల్పన చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఈ ఇంటర్న్ షిప్ ఉపయోగపడనుంది.
పూర్తి వివరాలకు ఈ లింకును అనుసరించండి. https://pminternship.mca.gov.in/login/
పథకానికి ఎవరు అర్హులంటే?
• 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, లేదా బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా చదివిన అభ్య ర్థులు ఈ పథకానికి అర్హులు. విద్యా ర్థుల వయసు 21- 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి సంవ త్సరం పాటు అయా సంస్థల్లో ఇంటర్న్ షిప్ అందిస్తారు. సగం కాలం పరిశ్రమల్లో అనుభవం గడించాల్సి ఉంటుంది. అయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది.
కావాల్సిన పత్రాలు..
దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫొటో, విద్యార్హత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థికి గరిష్టంగా 3 ఆప్షన్లు అందిస్తారు. ఎంపికైన వారికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు, బహుళ జాతి సంస్థలు, గ్యాస్, చమురు, ఇంధన రంగం, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆతిథ్య రంగాల్లో అవకాశాలు ఇస్తారు. ఇందుకోసం ఇప్పటికే అయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.
దరఖాస్తు చేసుకోండి ఇలా…
పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనడానికి https://pminternship.mca.gov.in/login/ వెబ్సై ట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబరు 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబ్ 25 వరకు నమోదు చేసుకోవచ్చు. 26వ తేదీన షార్టు లిస్ట్ ప్రకటిస్తారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్ధు లకు ఇంటర్న్షిప్ చేయడానికి సంస్థలను కేటాయిస్తారు. నవంబరులో ఆఫర్ లెటర్లు అందిస్తారు. డిసెంబరులో సంబంధిత సంస్థల్లో ఇంటర్నిషిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ విధానం అమలు చేస్తారు.
ఇంటర్నిష్‌లో 500 ప్రముఖ సంస్థలు..
ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులను దేశం లోని టాప్- 500 సంస్థల్లో శిక్షణ పొందడానికి ఎంపిక చేస్తారు. గత 3 ఏడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నికర లాభాల్లో కొంతమేర సమాజ సేవ నిమిత్తం సవ్యంగా ఖర్చు చేసిన టాప్- 500 సంస్థలను ఈ పథకం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఈ నిబంధనలు వర్తిస్తాయి…
• తల్లిదండ్రులు లేదా భార్యా, భర్తలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు.
• కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు.
• ప్రస్తుతం పూర్తి సమయం కోర్సులు చదువుతున్న వారు, ఐఐటీ, ఐఐఎం, నేషనల్ లా విశ్వవిద్యాలయం, ఎన్ఐటీ, ఐఐఐటీలు, సీఏ, ఎంబీబీఎస్, బీడీ ఎస్, ఎంబీఏ, సీఎస్, డిగ్రీలు పొందిన వారు కూడా ఇంటర్నిషిప్‌కు అనర్హులుగా పేర్కొన్నారు.
• వృత్తిపరమైన డిగ్రీలు చేసిన వారు, ఏదైనా స్కిల్ కోర్సుల్లో అప్రెంటీసిప్ చేసిన వారు కూడా పథకానికి అర్హత కలిగి ఉండరు.
ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజన పథకాలకు వర్తింప చేస్తారు. ఆ పథకం మేరకు పరిహారం చెల్లిస్తారు.