APPSC Group 2 Hall Tickets: నేటి నుంచి గ్రూప్2 హాల్ టిక్కెట్స్.. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షలు
14 February 2024, 11:53 IST
- APPSC Group 2 Hall Tickets: ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 హాల్ టిక్కెట్లు విడుదల
APPSC Group 2 Hall Tickets: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టిక్కెట్లను నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్నారు. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్ సైట్ http://www.psc.ap.gov.in లో అభ్యర్ధులకి అందుబాటులో హాల్ టిక్కెట్లు ఉంచినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకి 24 జిల్లాలలో కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
APPSC గ్రూప్ -2 పరీక్షలకి మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని సూచించారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలో ఏ ఒక్కటీ వాయిదా వేయలేని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. తప్పుడు వదంతులని అభ్యర్ధులు నమ్మవద్దని విజ్ణప్తి చేశారు.
యథాతథంగా ప్రిలిమినరీ పరీక్షలు….
గ్రూప్ 2 ప్రిలిమనరీ Preliminary పరీక్ష యధావిధిగా ఈ నెల 25 నే జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడుతున్నారు.
తొలుత జనవరి 10వ తేదీతో ఏపీపీఎస్సీ Group 2 దరఖాస్తుల గడువు ముగియగా మరో వారం పొడిగించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్తులు జనవరి 17వ తేదీ వరకు గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో మొత్తం 4,83,525 మంది గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ఏపీపీఎస్సీ మొత్తం 897 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా మరో రెండు పోస్టులను చేర్చింది. ఈ 899 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. నేటి నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో పోస్టుకు 537 మంది పోటీపడుతున్నారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అప్లికేషన్లలో తప్పులను సవరించుకునేందుకు జనవరి 24 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
పరీక్ష విధానం
గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. స్క్రీనింగ్ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షను 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు.
మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.