తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gold Seize : విజయవాడ విమానాశ్రయంలో బంగారంతో పట్టుబడిన ప్రభుత్వాధికారి భార్య

Gold Seize : విజయవాడ విమానాశ్రయంలో బంగారంతో పట్టుబడిన ప్రభుత్వాధికారి భార్య

B.S.Chandra HT Telugu

10 September 2022, 6:52 IST

    • Gold Seize విజయవాడ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో హైదరాబాద్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు  విజయవాడలో దాడులు జరిపారు. నిజానికి విజయవాడలో కూడా డిఆర్‌ఐ అధికారులు ఉన్నా హైదరాబాద్‌ నుంచి నేరుగా అధికారులు రంగంలోకి దిగారు. అయితే బంగారంతో పట్టుబడిన మహిళ ఏపీ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారు పేర్లను చెప్పడంతో సీన్ మారిపోయింది. 
విజయవాడలో బంగారంతో పట్టుబడిన నీరజారాణి
విజయవాడలో బంగారంతో పట్టుబడిన నీరజారాణి

విజయవాడలో బంగారంతో పట్టుబడిన నీరజారాణి

Gold Seize వ్యవహారం ఇప్పుడు విజయవాడలో దుమారం రేపింది. దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలు నీరజా రాణి వద్ద భారీగా బంగారం ఉందనే పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో ఆమె తరచూ దుబాయ్‌ వెళ్లి వస్తుండటం, బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని గుర్తించడంతో దుబాయ్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేరుగా సమాచారం పంపారు . దీంతో ఆమె విజయవాడ విమానాశ్రయంల ల్యాండ్ అవ్వగానే అదుపులోకి తసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

దుబాయ్ నుంచి తిరిగి వచ్చే సమయంలో తనిఖీలకు దొరకకుండా తప్పించుకోడానికి విజయవాడ విమనాశ్రయం చేరుకుంటున్నారని డిఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు. డిల్లీ నుంచి సమాచారం అందగానే ప్రయాణికురాలి నుంచి Gold Seize చేసిన అధికారులు ఆమెను ప్రశ్నించారు. డిఆర్ఐ అధికారులకు ఆమె పలువురు ఐఏఎస్‌ అధికారుల పేర్లను చెప్పడంతో వ్యవహారం బయటకు పొక్కింది. పేర్లు ఒకేలా ఉండటంతో ఆమె ఐఏఎస్‌ అధికారి భార్యగా మొదట ప్రచారం జరిగింది. తొలుత ఆరోగ్య సీఈఓ, ఆ తరవాత ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈఓ సతీమణిగా ప్రచారం జరిగినా తర్వాత డిఆర్‌ఐ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

సోషల్‌ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్‌ డైరెక్టర్‌గా 2019లో పదవీ విరమణ చేసిన రేగుళ్ల మల్లికార్జున రావు అనే అధికారి భార్య నీరజా రాణి దుబాయ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. మల్లికార్జున్ పదవీ విరమణ చేసిన యువజన శిక్షణ వ్యవహారాల శాఖలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ కల్చర్‌ విభాగానికి సిఈఓగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే కీలకమైన అధికారికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారం జరిగింది.మల్లికార్జున్ భార్య పట్టుబడగానే ఏపీ సిఎంఓ అధికారులు రంగంలోకి దిగారని చెబుతున్నారు.

గురువారం సాయంత్రం షార్జా నుంచి 38మంది ప్రయాణికులతో ఐఎక్స్‌ 536ఎయిర్‌బస్‌ ఎయిరిండియా విమానం వచ్చింది. నీరజారాణి తనతో పాటు బంగారం ఆభరణాలు తీసుకువచ్చారు. ఆమె దుబాయ్‌లో బంగారం ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారంతో దుబాయ్ నుంచి భారత్‌కు సమాచారం అందింది.

Gold Seize వ్యవహారంలో ప్రభుత్వ అధికారి భార్యను డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేగింది. వెంటనే పలువురు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. డిఆర్‌ఐ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 48 గంటలుగా ఆమెను డిఆర్‌ఐ అధికారులు గన్నవరం విమానాశ్రయంలోనే ఉంచి ప్రశ్నిస్తున్నారు. ఆమెను Gold Seize బంగారం తరలింపు వ్యవహారం నుంచి బయట పడేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి పట్టుబడ్డారు….

దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో మహిళా ప్రయాణికురాలి వద్ద బంగారం ఉందనే సమాచారంతో విజయవాడ చేరగానే డిఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారుల పేర్లను Gold Seize సమయంలో ఉపయోగించారు. దీంతో కేసు నుంచి బయటపడేందుకు ఆమె ప్రముఖుల పేర్లను ఉపయోగిస్తుందని భావించారు. అయితే కాసేపట్లోనే డిఆర్‌ఐ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి.విజయవాడ, ఢిల్లీ, హైదరాబాద్‌ స్థాయిలో రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై ఒత్తిడి చేయడంతో కేసును నీరు గారుస్తున్నారని ప్రచారం జరిగింది. రిటైర్ అయిన అధికారిని ఏరికోరి ప్రభుత్వంలో చేర్చుకోవడం వెనుక ఓ ముఖ‌్యమైన అధికారి ప్రమేయం ఉందని, ప్రభుత్వంలో చక్రం తిప్పే ఆ అధికారి పనులు చక్కబెట్టడం కోసం నియామకం చేశారనే ఆరోపణలున్నాయి. రెండేళ్ల పదవీ కాలం పూర్తైన తర్వాత మరోసారి ఎక్స్‌టెన్షన్ లభించింది.

సేఫ్‌ పాసేజ్ కోసమే….

విజయవాడ విమానాశ్రయంలో పెద్దగా తనిఖీలు ఉండకపోవడం, సేఫ్ పాసేజ్‌కు అనుకూలంగా ఉండటంతోనే దుబాయ్‌ నుంచి నేరుగా విజయవాడ వస్తున్నట్లు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే సిబ్బంది కూడా ఆమెకు సహకరించి ఉంటారని చెబుతున్నారు. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో సిబ్బంది సహకారంతోనే తరచూ దుబాయ్ వెళ్లి వస్తున్నట్లు డిఆర్ఐ భావిస్తోంది. దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళ వద్ద భారీగా బంగారం ఉందని ప్రచారం జరిగినా 970గ్రాముల బంగారం మాత్రమే దొరికిందని డిఆర్‌ఐ ఓ ప్రకటన విడుదల చేసింది. నిందితురాలి వద్ద భారీగా బంగారం దొరికినా ఒత్తిళ్ల కారణంగా తక్కువ చేసి చూపుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. కిలో లోపు బంగారం తరలింపు వ్యవహారంలో జరిమానాతో విడిచిపెడతారు. పన్ను ఎగవేతగా భావించి కస్టమ్స్‌ డ్యూటీ కట్టించుకుని వదిలేస్తారు. అంతకు మించి బంగారం లభిస్తే స్మగ్లింగ్ కేసులు పెడతారు. విజయవాడలో డిఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు ఉన్నా హైదరాబాద్‌ నుంచి నేరుగా ఉన్నాతాధికారులు సోదాలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను స్మగ్లింగ్ కేసు నుంచి బయట పడేయడానికి బంగారం తక్కువ చేసి చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు.

టాపిక్