తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srimahalakshmi Devi: శ్రీ మహాలక్ష్మీగా దర్శనమిస్తున్న దుర్గమ్మ,రేపు మూలానక్షత్రం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

SriMahaLakshmi Devi: శ్రీ మహాలక్ష్మీగా దర్శనమిస్తున్న దుర్గమ్మ,రేపు మూలానక్షత్రం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

08 October 2024, 6:11 IST

google News
    • SriMahaLakshmi Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రీ మహాలక్ష్మీ దేవి అంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
శ్రీ మహాలక్ష్మీ దేవి అంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

శ్రీ మహాలక్ష్మీ దేవి అంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

Indrakeeladri Day 06 శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ ష‌ష్టి శ‌నివారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తుంది.

“యాదేవీ స‌ర్వ‌భూతేషు సంస్థితా..” అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి... అని చండీ సప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ‌కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ రోజున నైవేద్యంగా పంచ‌భోగాలైన పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డూ, పులిహోర‌, ద‌ద్దోజ‌నాల‌ను నివేదిస్తారు.

దసరా శరన్నవరాత్రిమహోత్సవాల్లో ఆరో రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీచరిత్రలో, ఆదిపరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేసిందని చెప్పబడింది. ఈ మూడుశక్తుల్లో ఒక శక్తిన ఈ మహాలక్ష్మీ, అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషమర్ధినిగా ప్రసిద్ధిపొందింది. ఆ తరువాత మహిషమర్ధినీదేవి స్వరూపంతోనే ఈ ఇంద్రకీలాద్రిమీద వెలిసింది.

ఈ మహలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనంవసుః ర్ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే ॥ శ్రీ సూక్తంలో చెప్పపడింది.

అలాగే లక్ష్మీతంత్రం అనే గ్రంథంలో కూడా రాజ్యవిద్యాచ సౌభాగ్య అమృతకామ్య పరాదికాః సత్యభోగయోగలక్ష్మ్యై అష్టాచ ప్రకీర్తితాః॥ అని కొలిచారు.

1. సత్యలక్ష్మి 2. భోగలక్ష్మి 3. రాజ్యలక్ష్మి 4. యోగలక్ష్మి 5. విద్యాలక్ష్మి 6. సౌభాగ్యలక్ష్మి 7. అమృతలక్ష్మి 8. కామ్యలక్ష్మి అనే ఎనిమిది విధాలుగా మహాలక్ష్మీ దేవి కనిపిస్తుంది. అంతేకాదు. 1 ధనలక్ష్మి 2 ధాన్యలక్ష్మి 3. ధైర్యలక్ష్మి 4. విజయలక్ష్మి 5. ఆదిలక్ష్మి 6. విద్యాలక్ష్మి 7. గజలక్ష్మి 8. సంతానలక్ష్మి అని మరొక అష్టలక్ష్ములు కూడా లోకంలో ప్రసిద్ధమయ్యాయి.

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ త్రిశక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టే అమ్మవారి దేవాలయ కుడ్యకోష్టాల్లో చుట్టూరా అష్టలక్ష్మీ విగ్రహాల్ని అందంగా ప్రతిష్ఠించారు. తలచినంతనే అష్టరూపాలతో, ఈశరన్నవరాత్రుల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి తన రెండుచేతుల్లో కమలాల్ని ధరించి, వరదాభయహస్తాల్ని ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా, కమలాసనాసీనురాలుగా మనకిదర్శన మిస్తుంది. ఐశ్వర్యప్రదమైన ఆ మహాలక్ష్మిదేవి స్వరూపాన్ని భక్తితో ఒకసారి మనసారా ఇలాధ్యానించండి.

మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ మృడప్రియా

సిందూరాభించ పద్మస్థాం పద్మపత్రంచ దర్పణం

అర్ఘ్యపాత్రంచ దధతీం సద్భార మకుటాన్వితాం

నానాదాసీపరివృతాం కాంచీ కుండలమండితాం

లావణ్య భూమికాం వందే సుందరాంగద బాహుకాం॥

శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః

మూలా నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు….

అమ్మవారికి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తారని, ఆ రోజున లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.

తదుపరి వ్యాసం