తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Ghatroad: మరమ్మతులతో దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత, మహామండపం కాంప్లెక్స్‌ నుంచి మాత్రమే రాకపోకలు

Indrakeeladri GhatRoad: మరమ్మతులతో దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత, మహామండపం కాంప్లెక్స్‌ నుంచి మాత్రమే రాకపోకలు

20 November 2024, 14:04 IST

google News
    • Indrakeeladri GhatRoad: కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మతులు నిర్వహించడానికి బెజవాడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డును మూసివేశారు. మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్‌ రోడ్డును మూసివేశారు.  మరమ్మతుల తర్వాత ఘాట్‌ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తారు. 
విజయవాడ దుర్గగుడి
విజయవాడ దుర్గగుడి

విజయవాడ దుర్గగుడి

Indrakeeladri GhatRoad: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనాలకు వెళ్లే భక్తులకు  దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డులో కొండ చరియలకు  మరమ్మతు పనుల నేపథ్యంలో    మూసివేస్తున్నారు. మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్‌రోడ్ మూసివేయనున్నారు.  ఈనెల 21 వరకు ఘాట్‌రోడ్ మూసివేస్తారు. అవసరమైతే మరికొన్ని రోజులు ఘాట్‌ రోడ్డును మూసివేసి పనులు నిర్వహిస్తారు. 

కొండ చర్యలు విరిగిపడకుండా  రక్షణ చర్యలను ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు  కనకదుర్గానగర్ మీదుగా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీలు, సిబ్బంది  కూడా అదే మార్గంలో రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.

ఇంద్రకీలాద్రి  కొండకు  రక్షణ చర్యల్లో భాగంగా మైగ్రేషన్ వర్క్ చేపడుతున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కొండ చరియల మరమ్మతు పనులతో పాటు మెటీరియల్,  క్రేన్లు ఇతర  సామాగ్రిని ఘాట్ రోడ్డులో ఉంచుకొని పనులు చేపడతారు. నవంబర్ 19 నుంచి 21వ రకు ఘాట్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేస్తారు. పనుల్లో జాప్యం జరిగితే మరికొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. 

తదుపరి వ్యాసం