తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cpi Narayana: బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిస్తే, మళ్లీ జగన్‌కే లాభమన్న సిపిఐ నారాయణ

CPI Narayana: బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిస్తే, మళ్లీ జగన్‌కే లాభమన్న సిపిఐ నారాయణ

HT Telugu Desk HT Telugu

23 May 2023, 6:42 IST

google News
    • CPI Narayana: ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే చివరకు వైసీపీకే లాభం చేకూరుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ పడుతుందని, మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

CPI Narayana: ఏపీలో విపక్షాల ఐక్యతతో చివరకు లాభపడేది అధికార పార్టీయేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే చివరకు వైసీపీకే లాభం చేకూరుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ పడుతుందని, మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలించేందుకే ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారని నారాయణ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి విపక్షాల ఐక్యత తో వైసీపీ లాభపడుతుందన్నారు.

బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.'రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూర్చినట్టు అవుతుందని, ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో ఎటువంటి లాభం ఉండదన్నారు.

బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి మళ్లితే అప్పుడు మళ్లీ జగనే గెలుస్తారని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘ కాలం బెయిల్​పై ఎవరైనా ఉన్నారా..? అంటే అది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు.

బీజేపీ మద్దతు లేకుండా సుదీర్ఘ కాలం బెయిల్​, హత్యలు చేసిన అరెస్ట్ అవ్వకుండా తిరగడం సాధ్యం కాదని నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అవినీతి పాలనపై విస్తృతమైన చర్చ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి వివేకానందా రెడ్డిని ఎవరు చంపారు..? అనే విషయాన్ని రాష్ట్రంలోని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఇట్టే చెప్తారని, వివేకా హత్య కేసులో వివేకాను ఎవరు చంపారు అనే విషయం మాత్రం ఐపీఎస్ చదివినా సీబీఐ ఆఫీసర్లకు నాలుగేళ్లుగా తెలుసుకోలేకపోతున్నారన్నారు. జగన్ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో కలిసి సీబీఐని ఆటలాడిస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.

తదుపరి వ్యాసం