CM Jagan In Uddanam: ఉద్దానం కిడ్నీ రిసెర్చ్ సెంటర్, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించిన సిఎం జగన్
14 December 2023, 12:50 IST
- CM Jagan In Uddanam: శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ వ్యాధి ప్రభావిత ఉద్దానం ప్రాంతాలైన 7 మండలాల్లో గ్రామాలకు రక్షిత మంచినీటి పథకాన్ని అందించే డాక్టర్ వైఎస్‌ఆర్ సుజలధార పథకాన్ని జగన్ ప్రారంభించారు. కిడ్నీ రోగుల కోసం రిసెర్చ్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.
వైఎస్సార్ సుజలధార పథకాన్ని ప్రారంభించిన సిఎం జగన్
CM Jagan In Uddanam: శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పలు ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రారంభించారు.
వైఎస్ఆర్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు. వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ను మంత్రులతో కలిసి ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు.
200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సిఎం ప్రారంభించారు. పలాసలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ పథకాలతో 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీరు అందనుంది. 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా జరుగనుంది. ఉద్దానం ప్రాంతానికి మంచి నీటి కష్టాలు తీరిపోనున్నాయి.
కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్ హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకున్నారు. ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.