తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan On Cbn Arrest : ఖజానా దోచేశారు.. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - సీఎం జగన్

CM Jagan On CBN Arrest : ఖజానా దోచేశారు.. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - సీఎం జగన్

16 September 2023, 13:17 IST

google News
    • CM Jagan News : చంద్రబాబు అరెస్ట్ పై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని వ్యాఖ్యానించారు. చట్టం ఎవరికైనా ఒకటే అని గుర్తు చేశారు.
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (facebook)

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

CM Jagan On Chandrababu Arrest : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారని అన్నారు జగన్. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని… ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని ఘాటుగా మాట్లాడారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం సీఎం జగన్ పర్యటించారు. నాలుగో విడతలో వైఎస్సార్‌ కాపునేస్తం నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు. 45 ఏళ్ల నుంచి చంద్రబాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారని ఆరోపించారు సీఎం జగన్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని… ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారని గుర్తు చేసశారు. సాక్ష్యాదారాలతో సహా దొరికినా చంద్రబాబు బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు జగన్. ఎల్లో మీడియా నిజాలను చూపించదని… ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదని విమర్శించారు. నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే . ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది. ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. అసలు రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? ప్రజాధనం దోచుకున్న చంద్రబాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి…?లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు. వీరిని ప్రజలంతా గమనించాలి.. ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి. మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం” అని సీఎం జగన్ ప్రసంగించారు.

 ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులను జమ చేశారు సీఎం జగన్. ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు ఈ నిధులను అందిస్తున్నట్లు  తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 4 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. 

తదుపరి వ్యాసం